సిరిసిల్ల పట్టణంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని సాధన, గాయిత్రి, లక్ష్మి సూపర్‌మార్కెట్‌తోపాటు, తిరుమల ఎలక్ట్రానిక్స్‌లో తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ వస్తువులపై తయారీదారుడి పేరు లేకపోవడం, తయారు చేసిన తేదీ, ఎమ్మార్పీ ముద్రించకపోవడం, వస్తువును తయారు చేసి కంపెనీ చిరునామా ముద్రించలేదని గుర్తించిన నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
-
నాలుగు కేసుల నమోదు
-
నిబంధనలు పాటించిన సూపర్‌మార్కెట్లు
-
లీగల్ మెట్రోలజీ ఇన్‌స్పెక్టర్ పి.రవీందర్
సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని సాధన, గాయిత్రి, లక్ష్మి సూపర్‌మార్కెట్‌తోపాటు, తిరుమల ఎలక్ట్రానిక్స్‌లో తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ వస్తువులపై తయారీదారుడి పేరు లేకపోవడం, తయారు చేసిన తేదీ, ఎమ్మార్పీ ముద్రించకపోవడం, వస్తువును తయారు చేసి కంపెనీ చిరునామా ముద్రించలేదని గుర్తించిన నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. సూపర్‌మార్కెట్, ఎలక్ట్రానిక్ దుకాణాల్లో ఉన్న వస్తువులకు సంబంధించిన బిల్లులు కూడా సక్రమంగా లేకపోవడంతో సదరు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ పి.రవీందర్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా వ్యాపారం సాగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూకంలో వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్లలో చాలా మంది వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదని తెలిపారు.