సిరిసిల్లలో వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ము న్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను ఓదార్చారు. భవిష్యత్‌లో వరద ఇబ్బందులు లేకుం డా చూస్తానని హామీ ఇచ్చారు. వరదనీరు మానేరు వాగులోకి వెళ్లిపోయేలా చూస్తామని, అందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. నాలాలపై కబ్జాలను తొలగిస్తామని, ఈ క్రమంలో పేద లు నష్టపోతే డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని స్ప ష్టం చేశారు.
అంతకుముందు మంత్రి సిరిసిల్ల కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో వరదలపై సమీక్షించారు. వేములవాడ మూలవాగుపై కూలిన వంతెన ను శివరాత్రి జాతరలోగా నిర్మించాలని సూచిం చారు. వరదలతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని, పంటనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వరదలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఇందు కోసం రూ.1.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో వరద నీరు వెళ్లిపోయేలా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు.
వరద నీటిలో నడుస్తూ..
సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో వరద నీటిలో నడుస్తూ బాధితులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భోజనాలు, నీళ్లు అందుతున్నాయా! అని తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులు డ్రెయినేజీల్లో చెత్తను సరిగా తీయడం లేదని, అడిగినా పట్టించుకోవడం లేదని మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న డీఆర్‌ఎఫ్ బృందం వద్దకు వెళ్లి బాగా పని చేశారని అభినందించారు. ఇంకో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉండాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి మంత్రి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment