Rain water harvesting
-
వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ము న్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను ఓదార్చారు. భవిష్యత్‌లో వరద ఇబ్బందులు లేకుం డా చూస్తానని హామీ ఇచ్చారు. వరదనీరు మానేరు వాగులోకి వెళ్లిపోయేలా చూస్తామని, అందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. నాలాలపై కబ్జాలను తొలగిస్తామని, ఈ క్రమంలో పేద లు నష్టపోతే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని స్ప ష్టం చేశారు. అంతకుముందు మంత్రి సిరిసిల్ల కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వరదలపై సమీక్షించారు. వేములవాడ మూలవాగుపై కూలిన వంతెన ను శివరాత్రి జాతరలోగా నిర్మించాలని సూచిం చారు. వరదలతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని, పంటనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వరదలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఇందు కోసం రూ.1.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో వరద నీరు వెళ్లిపోయేలా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. వరద నీటిలో నడుస్తూ.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో వరద నీటిలో నడుస్తూ బాధితులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భోజనాలు, నీళ్లు అందుతున్నాయా! అని తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులు డ్రెయినేజీల్లో చెత్తను సరిగా తీయడం లేదని, అడిగినా పట్టించుకోవడం లేదని మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న డీఆర్ఎఫ్ బృందం వద్దకు వెళ్లి బాగా పని చేశారని అభినందించారు. ఇంకో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉండాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మంత్రి వెంట ఉన్నారు. -
ఇంకుడు బోరు!
తాగటానికో, వ్యవసాయం కోసమో భూమి లోపలి పొరల్లో నీటిని పైకి తెచ్చుకోవడానికి బోర్లు తవ్వుకోవడం మనకు తెలుసు. భూగర్భం వేగంగా ఖాళీ అయిపోతోంది. వర్షం పడినప్పుడైనా నీటిని భూమిలోకి ఇంకింపజేసుకోవాలి కదా.. అందుకే, ఇప్పుడు భూమిలోకి ఇంకింపజేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా తక్కువ లోతు (6 నుంచి 50 అడుగుల లోతు) బోర్లు తవ్వుకోవటమే ఉత్తమ మార్గం అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త డా. జగదీష్. ఈ ‘ఇంకుడు బోర్ల’ కథా కమామిషు ఏమిటో చూద్దాం..! భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపధ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. నెల్లూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ. జగదీష్ ఓ వినూత్నమైన వాన నీటి సంరక్షణ పద్ధతిని ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పాటూరువారి కండ్రిగలోని కొబ్బరి తోటలో ఈ ఇంకుడు బోరు’ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇంకుడు బోరు ప్రత్యేకత ఏమిటి? సాధారణ ఇంకుడు గుంట కొన్ని చదరపు మీటర్ల చోటును ఆక్రమిస్తే.. దీనికి కేవలం ఒక చదరపు మీటరు చోటు సరిపోతుంది. భూమి లోపలికి నిలువుగా బోరు గుంత తవ్వి, అందులోకి పీవీసీ పైపును దింపి, దాని పైన గరాటను అమర్చితే చాలు. దీన్ని ఇంకుడు గుంత అనే కంటే ‘ఇంకుడు బోరు’ అని పిలవటమే సమంజసం. భూమి లోపలకు నిలువుగా దింపే పీవీసీ పైపు ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వర్షపాతాన్ని బట్టి ఎంతో కొంత వర్షపు నీరు గరాటా ద్వారా కూడా భూమి లోపలికి ఇంకుతుంది. దీన్ని ఆరు బయట, పొలాల్లోనూ, బోరు బావి దగ్గర్లో గానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై నుంచి వచ్చే వర్షపు నీరును భూమిలోపలికి ఇంకింపజేసుకోవడానికి కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై నుంచి వచ్చే నీటిని గరాటలో పడే విధంగా కూడా పెట్టుకోవచ్చు. గరాట మూలంగా ఏర్పడే వత్తిడి కారణంగా భూమి లోపలికి నీరు చాలా వేగంగా, ఎక్కువ పరిమాణంలో ఇంకిపోతుందని డా. జగదీష్ అంటున్నారు. ఇది సాధారణ ఇంకుడు గుంత కన్నా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సులువుగా ఎవరైనా తమంతట తాము ఏర్పాటు చేసుకోగలిగిన వాన నీటి సంరక్షణ వ్యవస్థ అని డా. జగదీష్ తెలిపారు. సాధారణ ఇంకుడు గుంట కన్నా ఇది ఎంతో సమర్థవంతంగా వాన నీటిని భూమి లోపలికి ఇంకింపజేయగలుగుతుందన్నారు. ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ‘ఇంకుడు బోరు’ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు.. పీవీసీ పైపు, మెష్, గరాట, కొంచెం ఇసుక, గులకరాళ్లు మాత్రమే. పీవీసీ పైపునకు చుట్టూతా అంగుళం వెడల్పు ఉండే బెజ్జాలు పెట్టాలి. గుంత ఎంత లోతు తీస్తామో అంత పొడవు పైపు వాడాలి. ‘ఇంకుడు బోరు’ 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు లోతు పెట్టుకోవచ్చు. అంతకన్నా లోతు పనికిరాదు. పైపు ఒక చివరన అడుగు ఎత్తున పైపును వదిలేసి మిగతా పైపునకు మాత్రమే బెజ్జాలు పెట్టాలి. పైపు అడుగు వైపు, చుట్టూతా బెజ్జాలు వేసిన ప్రాంతం మొత్తానికీ ఫైబర్ మెష్‌ను చుట్టాలి. రెండు పొరలుగా చుడితే మంచిది. దీని ద్వారా భూమి లోపలికి ఇంకే వాన నీటితోపాటు మట్టి రేణువులు, ఇసుక రేణువులు పైపు లోపలికి వెళ్లకుండా ఈ మెష్ అరికడుతుంది. భూమి లోపలికి నిలువుగా హేండ్ బోరు (మరీ లోతుగా అయితే బోరు యంత్రం వాడాలి)తో గుంత తవ్వు కోవాలి. ఆ గుంతలో అడుగున అర అడుగు ఎత్తున గులకరాళ్లు వేయాలి. ఆ తర్వాత.. బెజ్జాలు వేసి మెష్ చుట్టి సిద్ధం చేసుకున్న పీవీసీ పైపును దింపాలి. దాని చుట్టూ ఇసుక, గులక రాళ్లు వేసి పూడ్చేయాలి. పైపు పై భాగంలో జీఐ షీటుతో చేసిన గరాటను అమర్చితే సరి.. ‘ఇంకుడు బోరు’ రెడీ అయినట్టే! పీవీసీ పైపు ఎంత పొడవుండాలి? నీటి లభ్యతను బట్టి 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు ఎంత లోతు అవసరం అనుకుంటే అంత లోతున్న ‘ఇంకుడు బోరు’ను ఏర్పాటు చేసుకోవచ్చు. లోతు పెరిగే కొద్దీ పీవీసీ పైపు వ్యాసం, పొడవుతో పాటు దాని పైన అమర్చే గరాటా సైజు కూడా ఆ మేరకు పెంచుకోవాలి. ఉదాహరణకు.. 6 అడుగుల లోతు చాలు అనుకుంటే.. 6అడుగుల పొడవు, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపు వాడాలి. గరాటా 1 అడుగు వెడల్పు ఉన్న గరాట పెట్టుకోవచ్చు. అదే.. 10 అడుగుల లోతు ‘ఇంకుడు బోరు’ కావాలనుకుంటే పైపు పొడవు 10 అడుగుల పొడవు, వ్యాసం 8అంగుళాలు ఉండాలి. గరాటాను కూడా మీటరు వెడల్పున ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక 50 అడుగుల లోతు వరకు 10అంగుళాల వ్యాసం కలిగిన పైపునకు 1 మీటరు వ్యాసం కలిగిన ఫనల్(గరాటా) అమర్చుకోవచ్చు. అధిక మోతాదులో నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. – కేఎస్వీ రాజన్, సాక్షి, ముత్తుకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సన్న, చిన్నకారు రైతులకు మేలు వర్షపు నీటి సంరక్షణ కోసం గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇంకుడు గుంతలు విఫలమయ్యాయి. అయితే, ఈ నూతన పద్ధతి ద్వారా వర్షపు నీటిని సులభంగా ఒడిసిపట్టుకోవచ్చు. ఈ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుంది. నిర్వహణ సమస్యలు ఉండవు. సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో, ఇళ్ల దగ్గర ఇది ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే పరికరాలతో కారు చౌకగా ఈ పరికరాన్ని తయారు చేసుకొని, తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. – డాక్టర్ ఏ. జగదీష్, శాస్త్రవేత్త, (94901 25950, 95336 99989) డైరెక్టర్, నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్, నెల్లూరు ఇంకుడు బోరు నిర్మాణానికి గుంత తవ్వుతున్న దృశ్యం, పీవీసీ పైపునకు బెజ్జాలు వేసి మెష్‌ను చుడుతున్న దృశ్యం -
వర్షపు నీటిని ఆదా చేయండి: ప్రధాని
న్యూఢిల్లీ : వర్షపు నీటిని ఆదా చేయడానికి గ్రామీణ ప్రజలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గ్రామ సర్పంచ్‌లకు లేఖలు రాశారు. ‘ప్రియమైన గ్రామ సర్పంచ్‌లకు నమస్కారం. మీరంతా ఆయురారోగ్యాలతో ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయేది వర్షకాలం. వరుణుడు మనకు సరిపడినంతా నీటిని అందించాలని ఆశిస్తున్నా. కాబట్టి మనమంతా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వర్షపు నీటిని పరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామ సభల్లో సర్పంచ్‌లు వర్షపు నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల’ని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా గ్రామస్తులు వర్షపు నీటిని వృథా కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోడానికి వీలుగా మరిన్ని చెక్ డ్యామ్‌లు, చెరువులను నిర్మించాలని మోదీ సూచించారు. కాగా ప్రధాని సంతకంతో ఉన్న ఈ లేఖలను ఆయా జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని గ్రామ సర్పంచ్‌లకు అందజేశారు. ఇక ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసి సమీపంలో ఉన్న సోన్‌భద్రలో 637 గ్రామ సర్పంచ్‌లు ప్రధాని లేఖను అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో కలెక్టర్ ఉమేశ్ మిశ్రా 601 లేఖలను గ్రామాలలో అందజేశారు. ఇక ఈ ప్రాంతంలో 775 చెరువులను తవ్వే ప్రణాళికను రూపొందించి పనులను కలెక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. శనివారం నీతి ఆయోగ్ మండలి సమావేశం జరుగనున్న నేపథ్యంలో.. వర్షపు నీటి ఆవశ్యకతను వివరిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచ్‌లకు వ్యక్తిగత లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఆదేశాల మేరకు జల శక్తి మంత్రిత్వ శాఖ అంతర్ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించి నీటి ఎద్దడి గురించి సమీక్ష నిర్వహించింది. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం
సాక్షి, సిటీబ్యూరో: వర్షపు నీటిని నేలగర్భంలోకి ఇంకించే ఇంకుడు గుంతలను నిర్లక్ష్యంచేస్తూ.. వాటి నిర్వహణ మరచిన సంస్థలకు జలమండలి తాజాగా నోటీసులు జారీచేస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పటికే ఇంకుడు గుంతలు ఉన్నచోట వాటిని బాగుచేసి...నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు నగరవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కాలనీసంక్షేమ సంఘాలు, పార్కులు, వాణిజ్య, నివాస భవనాల్లో ఇంకుడు గుంతల సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, వర్క్ఇన్స్పెక్టర్లు విధిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నెల 18న అన్ని వర్గాల వారు ఇంకుడు గుంతల సామర్థ్యం పెంపొందించే దిశగా వాటికి తక్షణం నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని, వాటిపై ఉన్న సిల్ట్ ఇతర ఘన వ్యర్థాలను తొలగించాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఇంకుడు గుంతలు లేని వారు సైతం తక్షణం వాటిని ఏర్పాటుచేసుకోవాలని..లేనిపక్షంలో సదరు భవనాలకు నీటిసరఫరాను తగ్గిస్తామని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జలవిల... గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటుమహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈనేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. నీతి ఆయోగ్ హెచ్చరికలు.... బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది. గ్రేటర్లో భూగర్భ జలవిల ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు, కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి... సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. వర్షపునీటిలో 60 శాతం వృథా వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జి పిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రేటర్లో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈపరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం సిటీజనుల పాలిట శాపంగా మారుతోంది. ఇంకుడు గుంతలతో ఎన్నో ఉపయోగాలు సాధారణ వర్షపాతం (20 మిల్లీ మీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని ఇంకుడు గుంత ద్వారా నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోతాయి. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జల బ్యాంక్ ఏర్పాటుచేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు..మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం..జీవం అందజేసిన వారవుతారు. – ఎం.దానకిశోర్, బల్దియా కమిషనర్, జలమండలి ఎండీ -
64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!
ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు. వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ వాటర్’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది. -
వానే వనరు...
♦ కాంక్రీట్ జంగిల్లో రెండు దశాబ్దాలుగా అదే ఆధారం ♦ వర్షపు నీటి సంరక్షణకు ఆదర్శం... సత్యభూపాల్ కుటుంబం ఎండలు మండుతున్నాయి. నేలలు నైబారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి.. జలాశయాలు బీడువారి.. కాంక్రీట్ జంగిల్ గొంతు తడవక గగ్గోలు పెడుతోంది. కుళాయిలున్నా.. బోరులు తవ్వుకున్నా.. చుక్క నీరు లేక సిటీజనుడు విలవిల్లాడుతున్నాడు. కానీ ఈ దాహార్తికి నగరంలోని ఓ ఇల్లు మాత్రం దూరం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా నీళ్లు... అదీ స్వచ్ఛంగా... నల్లా కనెక్షన్ లేకుండా... రెండు దశాబ్దాలుగా! నమ్మలేకపోయినా ఇది వాస్తవం. ఆ కుటుంబానికి వానే నీటి వనరు. వర్షపు నీటిని ఒడిసిపట్టి... నిల్వచేసి... అన్ని అవసరాలనూ తీర్చుకొంటోంది చంపాపేట గ్రీన్‌పార్క్ కాలనీలో నివసించే సత్యభూపాల్‌రెడ్డి కుటుంబం. సిటీ క‘న్నీటి’ వ్యధల మధ్య ఆ వాన నీటి కథేమిటో మనమూ తెలుసుకొందాం రండి... సాక్షి, హైదరాబాద్: రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.సత్యభూపాల్‌రెడ్డి, తులసి దంపతులది కర్నూలు జిల్లా. పిల్లల చదువులు, జీవనోపాధి కోసం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. చంపాపేటలోని గ్రీన్‌పార్క్ కాలనీలో 1989లో సొంతింటిని నిర్మించుకున్నారు. ఆ సమయంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్లి క్యాన్లలో తెచ్చేవారు. ఇంట్లోని బోరుబావిలో నీళ్లు పసుపురంగులో వచ్చేవి. ఇవి తాగలేక... అన్నేసి కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భూపాల్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదే వాన నీటి సంరక్షణ. మూడు దఫాలుగా వడపోత... మొదటగా 1995లో 5,400 లీటర్ల సామర్థ్యం గల మూడు సిమెంట్ ట్యాంకులు నిర్మించారు. వీటిలో వాన నీటిని మూడు దఫాలుగా వడపోసి రెండు నెలలపాటు తాగడానికి, వంటకు వాడారు. సిమెంటు ట్యాంకుల్లో అడుగుభాగాన 4 అంగుళాల మందంలో లావు రాళ్లు, దానిపై 40 మిల్లిమీటర్ల సైజు గల కంకర, ఆపై వరుసలో దొడ్డు ఇసుక, దీనిపై మెత్తటి ఇసుక 5 అంగుళాల మందం చొప్పున పోశారు. దీనిపై 5 అంగుళాల ఎత్తు వరకు కట్టె బొగ్గు, 3 అంగుళాల ఎత్తున మెత్తటి ఇసుక, రెండు అంగుళాల ఎత్తు వరకు కంకర నింపారు. పై భాగంలో మిగిలిన ఖాళీ స్థలంలోకి వర్షపు నీటిని నింపుతారు. మొదటి అంతస్తుకు పై కప్పుగా ఉన్న రేకులపై పడిన వర్షపు నీరు.. ప్రత్యేకంగా బిగించిన పైపుల ద్వారా ఈ ట్యాంక్‌లోకి చేరుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన నీటిని నేలపై ఏర్పాటు చేసిన మూడు ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. వీటి నుంచి రోజువారీ తాగడానికి, వంటకు వినియోగిస్తున్నారు. ‘మేం వినియోగిస్తున్న నీరు సురక్షితమేనా అని చాలా మంది ప్రశ్నించారు. దీంతో నీటిని పరీక్ష చేయించాం. నిర్దేశిత ప్రమాణాల మేరకు నీటిలో లవణాలు, జపాన్ తాగునీటి నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నట్లు తేలింది’ అని చెప్పారు భూపాల్. ఇంటి పెరడు ఇంకుడుగుంత... భూపాల్ ఇంటి పెరడు కూడా ఇంకుడు గుంతలా పనిచేస్తుంది. తాగడానికి అవసరమయ్యే నీరు తప్ప మిగిలిన వర్షపు నీరంతా ఆ పెరటిలో ఇంకిపోతుంది. ఇక్కడి మట్టి.. మెత్తగా, వదులుగా ఉంటుంది. చెట్ల ఆకులన్నింటినీ సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ప్రహరీని ఆనుకుని లోపలివైపు వర్షం నీరు భూమిలోకి ఇంకిపోయేలా... 4 అడుగుల లోతున 4 వరుసల్లో మట్టి ఇటుకలు పేర్చి.. దానిపై ఇసుకను బెడ్‌లా పోశారు. దీంతో వర్షపు నీరంతా బయటికి పోకుండా నేలలోకి ఇంకుతుంది. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతున నీటి లభ్యత ఉంది. కానీ వీరి ఇంట్లో 90 అడుగుల లోతున్న బోరుబావిలో 60 అడుగుల లోతులో నీరు లభిస్తుండడం విశేషం. ఇల్లు కట్టినప్పుడు 8.5 శాతం ఉన్న ఫ్లోరైడ్... ఇప్పుడు 1.5 శాతానికి తగ్గింది. ఈ పద్ధతిని చూసి 38 మంది శాస్త్రవేత్తలు తమ ఇళ్లలో అమలు చేస్తున్నారు. ‘డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక వాననీటి తాగుతున్నారని చాలామంది ఎగతాళి చేసేవారు’ అని గుర్తుచేసుకున్న సత్యభూపాల్ కుటుంబం ఇప్పుడు నీటి కటకట ఎదుర్కొంటున్న సిటీకి ఆదర్శం.