రెండో రోజూ సిరిసిల్ల బంద్
సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు బంద్ కొనసాగుతోంది.
కరీంనగర్: సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజుకు చేరుకుంది. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేసి జిల్లా కోసం ఆందోళన బాటపట్టారు.
సిరిసిల్లను వెంటనే జిల్లా కేంద్రాల్లో చేర్చాలని కోరుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద అఖిలపక్ష కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.