Special District
-
సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నిరసలుగా మారి మళ్లీ లష్కర్ ప్రత్యేక జిల్లా ఉద్యమం ఊపందుకుంది. లష్కర్ ప్రత్యేక జిల్లా సాధన సమితి పేరుతో ఆవిర్భవించిన ఉద్యమం క్రమేణా ఉధృతం అవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ‘మీతో సాక్షి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్, ఖైరతాబాద్ గణపతి వేదిక వద్ద ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా లష్కర్ జిల్లా సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి ప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలు స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ నగరానికి అన్యాయం జరిగిందనే వాదన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా నెలకొంది. అప్పట్లో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన కూడా చేశారు. అయితే హైదరాబాద్ జిల్లా ప్రాధాన్యం తగ్గుతుందన్న ఒకే ఒక్క కారణంతో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం స్వస్తి పలికిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధితో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి చరిత్రాత్మక సికింద్రాబాద్ నగరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకపోవడం పట్ల లష్కర్ ప్రజల్లో నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను హైదరాబాద్‌లో విలీనం చేసి ఒకమారు, జిల్లా ఏర్పాటు చేయకుండా మరోమారు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని అప్పట్లో వివిధ రంగాల ప్రతినిధులు నిరసనలు చేపట్టారు. అమలుకు నోచుకోని విలీన షరతులుసికింద్రాబాద్ నగరానికి 1960 నుంచి జరుగుతున్న వరుస అన్యాయాలు, వివక్షతో క్రమేణా ప్రాభవం తగ్గిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలోనూ పూర్తిగా వెనుకబడిందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను 1960లో హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. విలీనం నాటి నుంచి ఇప్పటి వరకు పన్నుల రూపంలో ఇక్కడి నుంచి గణనీయమైన ఆదాయం చేకూరుతున్నా అభివృద్ధి పనులకు మాత్రం ఆశించిన మేర నిధులు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ల విలీనం సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ల నియామకం, నిధుల కేటాయింపు తదితర అంశాలపై రూపొందించిర షరతులను విస్మరించారన్న వాదనలున్నాయి. ప్రత్యేక ప్యాకేజీని మరిచారు...బేగంపేట విమానాశ్రయం, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, పలు రైల్వేస్టేషన్లతోపాటు ప్యారడైజ్, మోండా మార్కెట్, జనరల్‌బజార్, రాణిగంజ్ వంటి చారిత్రాత్మక వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులు, ట్రాఫిక్ సమస్యలు యధాతథంగా ఉండడం ఈ ప్రాంత ప్రజలను అసంతృప్తికి గురి చేస్తున్నాయి.చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్సికింద్రాబాద్ నగరం 200 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అభివృద్ధి కోసం రూ.200 కోట్ల ప్యాకేజీని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా అయినా ప్రత్యేక ప్యాకేజీతో ఈ ప్రాంతంలో ఓ మోస్తరు అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది.ప్రత్యేక జిల్లాకు అర్హతలు ఇవీ.. పరిధి: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు (7): సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్. మున్సిపల్ డివిజన్లు: 42 ప్రత్యేక జిల్లాతోనే న్యాయం నగరాల అభివృద్ధిలో నా బాల్యం నుంచి సికింద్రాబాద్‌కు ప్రాధాన్యం దక్కలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల న్యాయం జరిగే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు రావడం ద్వారా ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి సాధిస్తుంది. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. దశాబ్దాల కాలంగా జరుగుతున్న అసమానతలను సవరించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. – విజయ్‌కుమార్, సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ఉద్యమానికి అనూహ్య స్పందన జిల్లా సాధన సమితి చేపట్టిన ఉద్యమానికి సికింద్రాబాద్ ప్రాంత ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఏడాది కాలంగా సికింద్రాబాద్ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించాం. మున్ముందు ఆందోళనలు ఉధృతం చేస్తాం. – సాదం బాల్‌రాజ్‌యాదవ్,ప్రధాన కార్యదర్శి జిల్లా సాధన సమితిప్రభుత్వంపై ఒత్తిడితో సాధిస్తాం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాను సాధించుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు, శాసనభ్యుల మద్దతును కూడగట్టాం. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను జాగృతం చేసి ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాం. జిల్లా సాధన జరిగే వరకు నిరంతర ఆందోళనలు కొనసాగిస్తాం. – గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు జిల్లా సాధన సమితి -
రెండో రోజూ సిరిసిల్ల బంద్
కరీంనగర్: సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజుకు చేరుకుంది. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేసి జిల్లా కోసం ఆందోళన బాటపట్టారు. సిరిసిల్లను వెంటనే జిల్లా కేంద్రాల్లో చేర్చాలని కోరుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద అఖిలపక్ష కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
మూడు రోజుల పాటు గద్వాల బంద్
గద్వాల : జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాయకులు గురువారం ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి గద్వాలను జిల్లా చేయాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు. -
ప్రత్యేక జిల్లాగా మెదక్
దసరా నుంచి కొత్త జిల్లాలోనే పాలన దశాబ్దాల కల నెరవేరిన వేళ నేడు పట్టణంలో సంబురాలు మెదక్: ప్రత్యేక జిల్లాగా మెదక్ ఏర్పాటు కానుండటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. దశాబ్దాల కళ ఇప్పటికీ నెరవేరడంతో సంబరపడిపోతున్నారు. ఒకప్పుడు నాలుగు జిల్లాలకు సుభాగా మెదక్ వర్ధిల్లినట్లు చరిత్ర చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మెదక్‌ను జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగించారు. జిల్లా సాధన సమితి పేరిట ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రత్యేక జిల్లా కోసం ఓ ఉద్యమ కమిటీ సభ్యుడు సైతం ఆమరణ నిరహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజల ఇబ్బందుల వర్ణాణాతీతం. ప్రత్యేక జిల్లా కోసం దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఈ ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మెలో పాల్గొంటూనే ప్రత్యేక జిల్లా కోసం ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు 2014 డిసెంబర్ 17న మెదక్‌కు వచ్చిన సందర్భంగా సభలో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతీరేకాలు వెలిబుచ్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ‘మెదక్ జిల్లా’ కోసం ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు అందరి కల సాకారమయ్యే క్షణాలు సమీపిస్తున్నాయి. కొత్త జిల్లాలో మండలాలివే.. దసరా నుంచి ఏర్పాటు కానున్న మెదక్ నూతన జిల్లాలో మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొత్తగా ఆవిర్భవించిన హవేళిఘణాపూర్, వెల్దుర్తి, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, చేగుంట, తూప్రాన్, పెద్దశంకరంపేట, టేక్మాల్,అల్లాదుర్గం, మండలాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని సైతం మెదక్ జిల్లాలోనే కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాని అక్కడి ప్రజలు కామారెడ్డి మండలంలోనే ఉంచాలని కోరుతున్నట్లు సమాచారం. పట్టలేని ఈ సంతోషాన్ని ప్రజలతోనే పంచుకుంటా ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లాకోసం ఎదురు చూస్తున్నారు. యేళ్లతరబడి ఉద్యమాలు కొనసాగించారు. ఆనాటి పాలకుల స్వార్థంతో జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో గల సంగారెడ్డికి తరలించారు. ఆనాటి పాలకులు రవాణా అనుకూలంగా చూసుకున్నారే తప్ప. ప్రజల బాగోగులు పట్టించుకున్న సందర్భాల్లేవు. జిల్లా ఒకచోట, దాని కేంద్రం మరోచోట దేశంలో ఎక్కడలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పడితే జిల్లాకేంద్రంలోనే అన్ని శాఖలుంటాయి. దీంతో పాలన మరింత చేరువ అవుతుంది. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రత్యేక జిల్లాకోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. దసరా నుండి కొత్త జిల్లా పాలన మెదక్‌లోనే జరుగనుంది. - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి -
ప్రత్యేక జిల్లా కోరుతూ జనగామ బంద్
► అట్టుడికిన జనగామ ► జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన ► అరెస్టులు.. రాస్తారోకోలు జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జనగామ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జనగామ, మద్దూరు, నర్మెట, లింగాలఘనపురం మండలాల పరిధిలో ధర్నాలు నిర్వహించారు. జనగామ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీసీతో పాటు పలు పార్టీల నాయకులు, మహిళ, విద్యార్థి సంఘాల నాయకులు రహదారిపై భైఠాయించారు. జిల్లా ఏర్పాటు చేయడానికి జనగామ అర్హత ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గంటపాటు రాస్తారోకో నడుస్తుండడంతో వరంగల్, హైదరాబాద్, విజయవాడ, సిద్దిపేట వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను బలవతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నాయకులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై పోలీసులు చేయి చేసుకోవడమే కాకుండా, వారి కెమెరాలను పగులగొట్టారు. దీంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగడంతో దిగివచ్చారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు జక్కుల వేణుమాధవ్‌కు గాయాలు కావడంతో పోలీసులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ సాంసృతి సంప్రదాయాలను ప్రతిభింబిచేలా మహిళలు బోనాలతో ఆందోళన చేపట్టి జనగామ జిల్లా ఆకాంక్షను తెలియజేశారు. -
ఆదివాసీ జిల్లా కోసం కదిలిన దండు
భారీగా తరలివచ్చిన ఆదివాసీలు జోడేఘాట్‌తో కూడిన కొమరం భీమ్ జిల్లా కోసం డిమాండ్ ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే కుట్రేనని ఆరోపణ కెరమెరి : ఆదివాసీ ప్రత్యేక జిల్లా కోసం ఆదివాసీల దండు కదిలింది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు గురువారం భారీగా తరలి రావడంతో జోడేఘాట్ మరో సారి దర్బార్‌ను తలపించింది. హట్టి నుంచి జోడేఘాట్ వరకు వందలాది మందితో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కొమరం భీమ్ సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిరంగ సభలో ఆదివాసీ వక్తలు, వివిధ సంఘాల నాయకులు, ఆఇఫాబాద్ మాజీ ఎమ్మేల్యే ఆత్రం సక్కు, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం భగవంత్‌రావు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, ఆదివాసీ రచయితల సంఘం నేత మైపతి అరుణ్‌కుమార్, వరంగల్ అడ్వోకేట్ పాపాలాల్, ప్రోఫెసర్ నాగేశ్వరరావు, జేఏసీ జిల్లా నాయకులు కనక యాదోరావు, వెడ్మ బొజ్జులు మాట్లాడారు. ఆదివాసీలను విడదీసే కుట్రలో భాగమే జిల్లాల పునర్విభజన అని, అందరు ఆదివాసీలు కలిసికట్టుగాఉంటే రాన్ను కాలంలో ఏలుతారని భావించి సీఎం కేసీఆర్ కట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కొమురం భీమ్ మండలాన్ని వేరే జిల్లాలో కలిపి కెరమెరిని మాత్రం ఆదిలాబాద్ లో కలుపుతామని ప్రకటించడం సరికాదన్నారు. మాననాటే.. మావరాజ్ (మా గ్రామంలో మా రాజ్యం ) వస్తే మనం బాగుపడతామన్నారు. ఇందుకు ప్రత్యేక జిల్లా సాధించి తీరుదామన్నారు. ఇంద్రవెల్లి నుంచి కౌటాల వరకు 13 మండలాలల్లో ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాలలో కొమురం భీమ్ విగ్రహం పెట్టనివ్వలేదు – కుంరం సోనేరావు గతంలో మంచిర్యాలలో తాత కొమురం భీమ్ విగ్రహం పెడతామంటే అరెస్ట్ చేశారు. మంచిర్యాలలో తాతకు అవమానం జరిగింది. అలాంటి జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ కొమురం భీమ్ మనవడు కొంమురం సోనేరావు అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఐక్యమంత్యంతో ఉంటే ఆదివాసీ జిల్లా ను సాధించుకో గలుగుతామన్నారు. ఆసిపాబాద్ జిల్లా చేస్తే మంచిది – ఏమాజీ 27 సంవత్సారాలు ఆసిపాబాద్ జిల్లా ఉంది. అందుకు ఆసిఫాబాద్ జిల్లా చేస్తే మంచిదని జెడ్పీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఏమాజీ అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 5 నుంచి 8 వందల ఎకరాలు వరకు ప్రభుత్వ భూమి ఉందని జిల్లా ఏర్పాటకు ఇది సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం కార్యాలయాలు సైతం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ఆసిపాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నైతం నారాయణ, జనార్ధన్, ఆత్రం లక్ష్మణ్, కోవ, అనక దేవ్‌రావు, కనక మాదవ్‌రావు, కుసుంబ్ రావు, సుగుణ, శేకర్, విజయ్‌కుమార్, మడావి కన్నిబాయి, వెంకటేశ్, బీజేపీ నాయకులు అంజనేయులు గౌడ్, పౌడల్, నాగేశ్వర్రావు, భీంరావు తదితరులున్నారు. -
‘నిర్మల్‌జిల్లా’ను అధికారికంగా ప్రకటించాలి
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని, జిల్లా ఏర్పాటుపై వెనుకడుగు వేయొద్దని నిర్మల్‌జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, కన్వీనర్ నాయిడి మురళీధర్ డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలంటూ శుక్రవారం పట్టణంలో అఖిలపక్షాలు, విద్యార్థులతో కలిసి భారీర్యాలీ, మానవహారం చేపట్టారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద మానవహారం చేపట్టి బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు, ఈమేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ కూడా చేసినట్లు చెబుతున్నారన్నారు. ఇలాంటి మాటలతో కాకుండా నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. జిల్లా ఏర్పాటు కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేస్తున్న కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా జిల్లాసాధన కోసం విద్యార్థులు, నాయకులు నినాదాలు చేస్తూ మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సాధన సమితి కో-కన్వీనర్లు అబ్దుల్ అజీజ్, నూకల గురుప్రసాద్, వెంకటేశ్, టీడీపీ పట్టణాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయ్యన్నగారి పోశెట్టి, బీజేపీ నాయకుడు నాలం నరేందర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాతర్ల హరీశ్ ముదిరాజ్, చరణ్, శశివర్మ, ప్రేమ్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, బొలిశెట్టి రాజేశ్, మాకు సాయి, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘జిల్లా’యిలే... జీడిపప్పులే!
ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలను ముక్కలు చేయడం కంటే చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఇరవై మూడు జిల్లాల రాష్ట్రం రెండుగా చీలింది. దీపంలా ఉన్న రాష్ట్రం ప్రమిదలా, వత్తిలా విడి పోయింది. జిల్లాల సంఖ్య క్షీణించడంతో పాలకులకు చిన్నతనంగా ఉండటం సహజం. ఆ చిన్నతనాన్ని దూరం చేసుకోడానికి వ్యూహ రచన చేసుకుని, పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాని రెండు చేస్తున్నామన్నారు. అందుకు కత్తులు, కత్తెర్లు సిద్ధం చేసుకున్నారు. కొత్త జిల్లాలకు ఇష్టుల పేర్లు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోవచ్చు. కేసీఆర్‌కి నిజాములన్నా, వారి పాలనన్నా పరమ ప్రీతి. ఆయన నిజాము రోజుల్ని స్వర్ణయుగంగా భావిస్తారు. ఆ పరంపరలోని కొందరి పేర్లు తప్పక జిల్లాలకు పెడతారు. పాల్కురికి సోమన, బమ్మెర పోతన తప్పదు. ఇంకా కొందరు ఉర్దూ కవి గాయకులను సంభావించుకుంటారు. ఇక ఉద్యమ నేతలకు, అమర వీరులకు పెద్దపీటలు వేస్తారు. పేర్లు మిగిలితే జిల్లాల్ని పెంచుకుంటాం. ఇంకా తగ్గితే మిషన్ కాకతీయలో పునర్జన్మకి నోచుకుంటున్న ముప్పై వేల చెరువులకు బారసాలలు చేస్తాం. ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాలుగడుగులు ముందుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి జిల్లాని అంట్లు తొక్కి మూడు చేస్తారు. దేశంలోనే జిల్లాల విషయంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలుపుతారు. అత్యధిక జిల్లాలున్న రాష్ట్రాలకు అగ్రనేతగా గిన్నిస్‌లో స్థానం పొందినా ఆశ్చర్యం లేదు. కొత్త జిల్లాల ఆలోచన మంచిదే. అనేకమంది కలెక్టర్లు, బోలెడు మంది యస్పీలు వారి వారి అధికారా లతో రంగప్రవేశం చేస్తారు. యంత్రాంగం, మంత్రాంగం తామరతూడులా విస్తరిస్తుంది. మంది మార్బలం, వందిమాగధులు, ఆశ్రీతులు, భజనపరులు, సామాజి కులు... పెద్ద బలగమే ఏర్పడుతుంది. వికేంద్రీకరణ మంచిదే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చాలా వ్యవస్థలు, దానికి తగిన అవస్థలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ, మండల వ్యవస్థ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉండగా- పైన పెత్తనం చేయడానికి ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు వుండనే వుండిరి. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యానికి లోటేమి వచ్చిందో తెలియదు. ఇప్పుడు ప్రతి కొత్త జిల్లాకు కనీసం వెయ్యిమంది కొత్త జీతగాళ్లు అవసరపడతారు. వారి జీతాలు, నాతాలు, పెట్రోళ్లు, సెల్ఫోన్లు, పర్యటనలు అన్నీ కలిసి తడిసి మోపెడవుతుంది. ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి రాజ్యాంగంలోని ఏ అధికరణం అనుమతిచ్చిందో చెబితే బావుంటుంది. ప్రజా సేవకుల సంఖ్యని పెంచుకుంటూ వెళ్లడం కన్నా, వారిలో సేవానిరతిని, ఉద్యోగ ధర్మాన్ని పెంచడం మంచిది. ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలని ముక్కలు చేయడం కంటే అత్యవ సరంగా చేయతగ్గవి అనేకం ఉన్నాయి. సర్కారు పాఠశాలల్లో అయ్యవార్లను నియమించవచ్చు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల్ని పెంచవచ్చు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలు నిర్భయంగా జీవించేలా చెయ్యచ్చు. ధర్మాసు పత్రులలో కాస్తంత నీడ, కొంచెం దయా దాక్షిణ్యాలతో వైద్యం అందేలా వ్యవస్థను మరమ్మత్తు చేయతగు. ఏలినవారికి ఏమాత్రం అవకాశమున్నా మార్కెట్ యార్డు లకి పై కప్పులు సమకూర్చవచ్చు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
'జనగామను జిల్లాగా ప్రకటించండి'
తెలంగాణ విముక్తి కోసం జరిగిన రైతాంగ పోరాటం నుంచి మలి దశ ఉద్యమం వరకు తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుందనీ.. ప్రతిసారి ఉద్యమం కోసం ఎంతో మంది వీరుల్ని ఇచ్చిన జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని నిర్వహిస్తున్న దీక్ష 50వ రోజుకు చేరుకుంది. జనందీక్ష పేరుతో నిర్వహిస్తున్న ఈ దీక్ష 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమాల ఖిల్లా జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని డిమండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. జనగామ సెంటర్లో భారీ మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. నడి రోడ్డుపై విద్యార్థులు ఖోఖో ఆడి తమ నిరసనను తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఈ డిమాండ్‌కు అన్నివర్గాల వారి మద్దతు పెరుగుతోంది. -
ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్‌కు తరలింపు
హైదరాబాద్ : మాజీమంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ....పోలీసులు మంగళవారం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చిన్నారెడ్డి ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు చికిత్స నిమిత్తం నిమస్కు తరలించారు. మరోవైపు దీక్ష విరమించాలని పార్టీ నేతలతో పాటు, పోలీసులు విజ్ఞప్తి చేసినా చిన్నారెడ్డి పట్టు వీడలేదు. దీంతో పోలీసులు ఆయనపై 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
తొలి అడుగు
శ్రీరాంపూర్/మంచిర్యాల టౌన్/మంచిర్యాల : ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు మొదటి అడుగు పడింది. ఇన్నాళ్లు రాజకీయ ప్రకటనలకే పరిమితమైన జిల్లా ఏర్పాటుకు గురువారం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో తూర్పు వాసుల కల నెరవేరనుంది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న పది జిల్లాలతో కలిపి మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని పొందుపరి చింది. అందులో మంచిర్యాల మొదటిదిగా పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత పలుమార్లు సభల్లో కేసీఆర్ 24 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రస్తావించారు. గురువారం తాజాగా మొదటి దశలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యపేట, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాలుగా ఉన్నాయి. ఈ ఏడు జిల్లాల ఏర్పాటుకు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)ను ఆదేశించారు. ఇది కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎంతో కీలక నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికారికంగా కొత్త జిల్లాల కసరత్తును ప్రభుత్వం మొదలు పెట్టింది. అనువైన ప్రాంతం మంచిర్యాలలో జిల్లాకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రైలు, బస్సు మార్గాలు జిల్లాలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయబడి ఉండటం, జాతీయ రహదారి కూడా జిల్లా ఏర్పాటయ్యే తూర్పు ప్రాంత మీదుగా ఉండటం కలిసొచ్చే అంశంగా పేర్కొనవచ్చు. ఒక పక్క సింగరేణి, మరోపక్క వ్యవసాయ రంగం, సిమెంటు, సిరామిక్స్ కంపెనీలు ఉండటం, వాణిజ్యం, వ్యాపారం రంగాల్లో కూడా పెద్దపెద్ద పట్టణాలకు తీసిపోని విధంగా మంచిర్యాల విస్తరించింది. వీటిన్నింటికంటే ముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తూర్పు ప్రాంతానికి ఏమాత్రం అందుబాటు దూరంలో లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పరిపాలన సౌలభ్యం కోసం శాస్త్రీయంగా కూడా మంచిర్యాల జిల్లా ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వ గుర్తించింది. జిల్లా కేంద్రం కంటే హైదరాబాదే నయం వేమనపల్లి మండలవాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సమానదూరం జిల్లా కేంద్రం ఉండటం మూలంగా ఆయా పనుల మీద వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లడం కంటే రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు వెళ్లడం ఎంతో మేలు. జిల్లా కేంద్రంకు ఏదైన పనుల మీద వెళ్లాలంటే సామాన్యులకు పెను భారంగా మారింది. పాలనా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ఇక్కడి నుంచి వెళ్ళే అధికారులు, ఉద్యోగులతోపాటు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించుకొనే వారికి దూరం ప్రధాన సమస్యగా మారింది. వివిధ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, ఉద్యోగాల ఎంపిక కోసం వెళ్లే అభ్యర్థులతోపాటు ఇతర పనుల మీద జిల్లా కేంద్రానికి వెళ్లే వారందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుకు మంచిర్యాలే ముఖచిత్రం తూర్పు జిల్లాకు మంచిర్యాలనే ముఖ చిత్రంగా చెప్పుకోవచ్చు. 1905లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. 1940 వరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా విస్తీర్ణం 16,128 కిలో మీటర్లు కాగా జనాభా దాదాపు 30 లక్షలకు పైగా ఉంది. జిల్లాలోని 52 మండలాల్లో 26 మండలాలు తూర్పు జిల్లాలోనే ఉన్నాయి. జన్నారం నుంచి సిర్పూర్ వరకు ఉన్న ఈ మండలాలకు మంచిర్యాల నడిబొడ్డున ఉంటుంది. అయితే జిల్లా కేంద్రం ఆదిలాబాద్ భౌగోళికంగా ఉత్తర ంగా ఈ ప్రాంతానికి సుదూరంలో ఉంది. తూర్పు జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పశ్చిమ జిల్లా పరిధిలో మరో ఐదు నియోజకవర్గాలున్నాయి. తూర్పు జిల్లాలో అటవీ సంపద విస్తారంగా ఉంది. బొగ్గు, సున్నపురాయి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మంచిర్యాల నుంచి ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్, జైపూర్, లక్నో ప్రాంతాలకు వెళ్లడానికి రైలు సదుపాయం ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా, మౌలిక వసతులు పరంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల రాష్ట ముఖ్యమంత్రి మంచిర్యాలను పోలీసు కమిషనరేట్ ప్రకటన కూడా కొంత ఆజ్యం పోస్తుంది. -
గిరిజన జిల్లాకు ఓకే
జంగారెడ్డిగూడెం :పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్‌కు ఆమో దం లభించడంతో ఖమ్మం జిల్లానుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా కలిసిన ముంపు మండలాలతో కలిపి గిరిజన ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. అయితే, పోలవరం కేంద్రంగా గిరి జన జిల్లాను ఏర్పాటు చేయూలని కోరారు. ప్రత్యేక గిరిజన జిల్లా అంశంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం అభిప్రాయ సేకరణ జరి పారు. జంగారెడ్డిగూడెంలోని గంగాభవాని కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యూరు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలను కలిపి 20 మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించిందన్నారు. తొలిదశలో అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, తదుపరి పీసా చట్టం ప్రకారం గ్రామ గ్రామాన సభలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా జంగారెడ్డిగూడెం డివిజన్లో కలిసిన బూర్గం పాడు పరిధిలోని ఆరు గ్రామాలను కుకునూరు మండలంలో కలిపారని వెల్లడించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్ని కేఆర్‌పురం ఐటీడీఏలో కలిపే ఆలోచన ఉందని తెలి పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయూలన్నది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు గిరిజన జిల్లా ఏర్పాటుకు సంబంధించి తొలిదశలో అభిప్రాయ సేకరణ చేపట్టామన్నా రు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. పోలవరం కేంద్రంగానే కావాలి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న గిరిజన ప్రజాప్రతినిధులలో ఎక్కువ మంది రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు దూరం ఎక్కువగా ఉంటుందన్నారు. పోలవరాన్ని మధ్యస్థంగా తీసుకుని జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే అటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మండలాలకు అనువుగా ఉంటుం దని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే మొడి యం శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున పోలవరాన్నే జిల్లా కేంద్రంగా చేస్తే బాగుం టుందన్నారు. దీనివల్ల నిర్వాసితులకు మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పా టు చేయాలంటే నిధులు అవసరమవుతాయన్నారు. రంపచోడవరంలో ఇప్పటికే ఉన్నతాధికారుల కార్యాలయాలు అనేకం ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు అంశంపై కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. సమావేశంలో డీపీవో ఎ.నాగరాజు వర్మ, జంగారెడ్డిగూడెం ఇన్చార్జి ఆర్డీవో ఆర్వీ సూర్యనారాయణ, ఐటీడీఏ ఇన్చార్జి పీవో పులి శ్రీనివాసులు , తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ముంపు గ్రామాల అధికారుల డుమ్మా సమావేశానికి వేలేరుపాడు, కుకునూరు మండలాలకు చెందిన అధికారులు డుమ్మా కొట్టారు. జీలుగుమిల్లిలో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనూ ఆ మండలాల అధికారులెవరూ రాలేదు. జంగారెడ్డిగూడెం నుంచే పాలన ఆగస్టు 1నుంచి కుకునూరు, వేలేరుపాడు మండలాలకు రేషన్ సరుకులతోపాటు ఆ ప్రాంతాల్లోని వారికి పింఛన్ల పంపిణీ వంటి పాలనాపరమైన కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ నుంచే జరుగుతాయని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. రెండు రోజుల్లో అక్కడి ప్రజలను కలసి వారి అవసరాలను తెలుసుకుంటామన్నారు. సాక్షి, ఏలూరు: ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గిరిజనులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతో పాటు, ఖమ్మం జిల్లానుంచి రెండు జిల్లాల్లోనూ కలిసిన మండలాలను కలిపి గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు 15 రోజుల క్రితం హైలెవెల్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారని చెప్పారు. దీనిపై అభిప్రాయ సేకరణ చేశామన్నారు. జిల్లా కేంద్రం పోలవరంలో ఉండాలని కొందరు, రంపచోడవరంలో ఏర్పాటు చేయూలని మరికొందరు కోరుతున్నారన్నారు. ఈ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హెడ్‌వర్క్స్, స్పిల్‌వే, పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందని తెలి పారు. పునరావాస కాలనీకి అవసరమైన భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ముంపు మండలాల అధికారులు సాంకేతి కంగా మన జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ వారు ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాలేదంటున్నారని, నిజానికి వాళ్లకూ తానే కలెక్టర్‌నని భాస్కర్ అన్నారు. ఆ విషయం నెలాఖరున జీతాలు ఇచ్చేప్పుడు ఆ అధికారులకు స్పష్టమవుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి స్థల సేకరణ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం చూడాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో 280 ఎకరాల విమానాశ్రయ భూము లు అందుబాటులో ఉన్నాయని, వెంకట్రామన్నగూడెం, చింతలపూడిలో అటవీ భూమిని కూడా గుర్తించామన్నారు. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. -
ప్రత్యేక జిల్లాపై చిగురిస్తున్న ఆశలు
మెదక్, న్యూస్‌లైన్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు అంశం తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ప్రత్యేక జిల్లాపై ఈ ప్రాంతవాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుత మెదక్ జిల్లాలోని మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మెదక్ కేంద్రంగా ఏర్పడే జిల్లా లో మెదక్‌తోపాటు ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ ప్రాంతాలను కలిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చరిత్రలోకి వెళితే... కాకతీయుల ఖిల్లాగా... మొఘల్ చక్రవర్తుల రాజమహల్‌గా మెదక్ పట్టణం పేరుగాం చింది. అప్పట్లో నాలుగు జిల్లాలకు సుభాగా విరాజిల్లింది. మెదక్, అత్రాఫ్-ఇ-బల్దియా(హైదరాబాద్), మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు మెదక్ సుభా పరిధిలో ఉండేవి. కానీ 1932లో ఆనాటి నవాబులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటుందన్న ఏకైక కారణంతో వెయ్యి జనాభా కూడా లేని సంగారెడ్డి ఠమొదటిపేజీ తరువాయి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అప్పట్లోనే 12 వేల జనాభా గల మెదక్ పట్టణ చరిత్ర మసకబారుతూ వచ్చింది. 57 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం.. జిల్లా కేంద్రం విషయంలో మెదక్ పట్టణం నాటి పాలకుల అవకాశవాద వైఖరి వల్ల అనాదిగా దగా పడుతోంది. 1957లో సంఘ సేవకుడు రామదాసు మెదక్ జిల్లా కేంద్రం కోసం 43 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కళా వెంకట్రావు మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అనంతరం మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో మెదక్ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఆమె ఇచ్చిన హామీ కూడా నెరవేరకుండానే పోయింది. ఆపై జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో 2010 అక్టోబర్ 14 నుంచి 57 రోజులపాటు రిలే దీక్షలు చేపట్టి, లక్ష సంతకాలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రికి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి కూడా వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాకు కావాల్సిన అన్ని భౌగోళిక, రాజకీయ చరిత్ర ఉందని, అందువల్ల మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రతి గణతంత్ర దినోత్సవం మెదక్ నియోజకవర్గ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి, చారిత్రక ఖిల్లాపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడుతుందన్న సంకేతాలు అందుతుండడంతో ఈ ప్రాంతంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది.