ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని, జిల్లా ఏర్పాటుపై వెనుకడుగు వేయొద్దని నిర్మల్‌జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, కన్వీనర్ నాయిడి మురళీధర్ డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలంటూ శుక్రవారం పట్టణంలో అఖిలపక్షాలు, విద్యార్థులతో కలిసి భారీర్యాలీ, మానవహారం చేపట్టారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద మానవహారం చేపట్టి బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు, ఈమేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ కూడా చేసినట్లు చెబుతున్నారన్నారు. ఇలాంటి మాటలతో కాకుండా నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. జిల్లా ఏర్పాటు కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేస్తున్న కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా జిల్లాసాధన కోసం విద్యార్థులు, నాయకులు నినాదాలు చేస్తూ మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సాధన సమితి కో-కన్వీనర్లు అబ్దుల్ అజీజ్, నూకల గురుప్రసాద్, వెంకటేశ్, టీడీపీ పట్టణాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయ్యన్నగారి పోశెట్టి, బీజేపీ నాయకుడు నాలం నరేందర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాతర్ల హరీశ్ ముదిరాజ్, చరణ్, శశివర్మ, ప్రేమ్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, బొలిశెట్టి రాజేశ్, మాకు సాయి, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘నిర్మల్‌జిల్లా’ను అధికారికంగా ప్రకటించాలి
Published Sat, Jul 2 2016 11:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement