'జనగామను జిల్లాగా ప్రకటించండి' | ' Announce janagama as district' | Sakshi
Sakshi News home page

'జనగామను జిల్లాగా ప్రకటించండి'

Published Thu, Dec 3 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

' Announce janagama as district'

తెలంగాణ విముక్తి కోసం జరిగిన రైతాంగ పోరాటం నుంచి మలి దశ ఉద్యమం వరకు తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుందనీ..  ప్రతిసారి ఉద్యమం కోసం ఎంతో మంది వీరుల్ని ఇచ్చిన జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని నిర్వహిస్తున్న దీక్ష 50వ రోజుకు చేరుకుంది.

జనందీక్ష పేరుతో నిర్వహిస్తున్న ఈ దీక్ష 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమాల ఖిల్లా జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని డిమండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. జనగామ సెంటర్‌లో భారీ మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. నడి రోడ్డుపై విద్యార్థులు ఖోఖో ఆడి తమ నిరసనను తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఈ డిమాండ్‌కు అన్నివర్గాల వారి మద్దతు పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement