
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి వ్యవసాయ బావిలో పడింది. అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు చేరుకొని రెస్క్యూ టీం ద్వారా పులిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరుతను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.(చదవండి: పులిపై మత్తు ప్రయోగం.. )
Comments
Please login to add a commentAdd a comment