సిరిసిల్లలో బంద్‌ సంపూర్ణం | siriclla bandh sucess | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో బంద్‌ సంపూర్ణం

Published Sat, Aug 20 2016 11:27 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

siriclla bandh sucess

  • స్తంభించిన ప్రజాజీవనం
  • వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థల బంద్‌
  • సిరిసిల్ల : సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తలపెట్టిన బంద్‌ విజయవంతమైంది. వేకువజాము మూడుగంటల నుంచే ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వేములవాడ, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్‌ డిపోలకు సమాచారం అందించి బస్సులు రానీయెుద్దని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు. సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు తెరుచుకోలేదు. ఆందోళనకారులు కరీంనగర్‌–కామారెడ్డి ప్రధాన రహదారిపై చంద్రంపేట, నేతన్నచౌక్, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద టైర్లకు నిప్పు పెట్టారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. రద్దీగా ఉండే గాంధీచౌక్, పాత బస్టాండు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆందోళనలు, నిరసనల మధ్య బంద్‌ సాగింది. అన్ని వర్గాలవారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బంద్‌కు సంఘీభావం తెలిపారు. అంబేద్కర్‌ చౌరస్తాలో కళాకారుల పాటలు, నాయకులు ఉపన్యాసాలు ఉత్తేజపరిచాయి.  కరీంనగర్‌ డీఎస్పీ రామారావు, సీఐ మహేశ్‌గౌడ్, వేములవాడ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, సదన్‌కుమార్‌ ఆందోళనకారులను కట్టడి చేశారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement