
సాక్షి, రాజన్నసిరిసిల్ల : రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్ల బివైనగర్‌లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో ఉన్న కార్మిక చట్టాలను , సంక్షేమాలను మరించ మెరుగు పరిచి కార్మికులకు అందేవిధంగా కృషిచేస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక సిరిసిల్ల కార్మికులకు ఏం ప్రయోజనం కలుగుతుందని ఊహించామో, అదంతా ఇపుడు శూన్యమన్నారు. రాబోయే కాలంలో నేత కార్మికులకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉండే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment