సిరిసిల్ల జిల్లా కోసం మహాపాదయాత్ర
సిరిసిల్ల జిల్లా సాధన కార్యాచరణలో భాగంగా జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మహాపాదయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు యాత్ర కొనసాగింది. వేములవాడలో బీజేపీ నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికారు. సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్‌కు బుద్ధిప్రసాదించాలని కోరుతూ ఉద్యమకారులు ఎములాడ రాజన్నకు మెుక్కులుచెల్లించుకున్నారు.
-
జిల్లాసాధన జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడకు..
-
ఎల్లారెడ్డిపేటలో బంద్ సంపూర్ణం
-
ముస్తాబాద్‌లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
-
గంభీరావుపేటలో వాటర్ ట్యాంకర్ ఎక్కి యువకుడి నిరసన
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన కార్యాచరణలో భాగంగా జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మహాపాదయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు యాత్ర కొనసాగింది. వేములవాడలో బీజేపీ నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికారు. సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్‌కు బుద్ధిప్రసాదించాలని కోరుతూ ఉద్యమకారులు ఎములాడ రాజన్నకు మెుక్కులుచెల్లించుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మండలం రగుడులో రాస్తారోకో చేశారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేటలో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న బీజేపీ నాయకులు కంచర్ల పరుశరాములు, పట్టూరి రాజేశం గుప్తా ఆరోగ్యం క్షీణించడంతో పోలుసులు రంగప్రవేశం చేశారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సైతం వారు దీక్ష కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కోసం చేపట్టిన మండల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ముస్తాబాద్ మండలం గూడెంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిరిసిల్ల–ముస్తాబాద్ రహదారిపై బైఠాయించారు. ఇదే మండలం ఆవునూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గంభీరావుపేట మండలంఓ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. వార్డుసభ్యుడి నుంచి ఎంపీ వరకూ అధికార పార్టీ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బట్టు ప్రవీణ్.. సిరిసిల్ల జిల్లా ప్రకటించాలనే డిమాండ్‌తో వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. నాయకుల జోక్యంతో కిందకు దిగాడు.