సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్‌ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment