
రాజన్నసిరిసిల్ల: వేములవాడలో ఆదివారం సాయంత్రం గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాలవారు దాదాపు 20 నిముషాలపాటు రణరంగాన్ని సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాలు.. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడిని మరో యువకుడు ప్రశ్నించాడు. నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. రెండు గ్రూపుల యువకుల పరస్పర దాడులతో స్థానియకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. గొడవకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది.
(చదవండి: వెళ్లనీయరు.. ఉండనీయరు..)
Comments
Please login to add a commentAdd a comment