
సాక్షి, వరంగల్ : పాతను వదిలించుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రపంచమంతా ఎన్నో వేడుకలు, సంబురాలు జరిగాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అయ్యాయి. తెలంగాణకు సంబంధించి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కిరాక్ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
వరంగల్ క్లబ్‌లో జరిగిన న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్‌చేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులు, హావభావాలను మార్చుతూ అద్భుతంగా నర్తించారాయన. పోస్ట్ అయిన కొద్దిసేపటికే వీడియోలు వైరల్ అయ్యాయి. కోడలి అనుమానాస్పద మృతి కేసులో కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రాజయ్య ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత న్యూఇయర్ పార్టీలో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన ఆయన అందరితో సరదాగా గడిపారు.
న్యూ ఇయర్ వేడుకలో అదరగొట్టిన మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment