యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మృత్యుంజయం, పొన్నం, కేకే
గంభీరావుపేట(సిరిసిల్ల) : టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, దోపిడీ విధారనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీం నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పార్టీశ్రేణులను కోరారు. మండలా నికి చెందిన పలువురు యువకులు బుగ్గ కృష్ణమూర్తి నేతృత్వంలో మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మృత్యుంజయం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామంలో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, కేకే మ హేందర్‌రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పాటైం దన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో నియంత పా లన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, సాహెబ్, బండారి బాల్‌రెడ్డి, ఎస్‌కే గౌస్, లక్ష్మారెడ్డి, కరికే శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, బానోత్ రాజునాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment