KK Mahender Reddy
-
ఈ ప్రాంతంపై మాజీ మంత్రి కేటీఆర్ సవతిప్రేమను ఒలకబోశారు..
సిరిసిల్ల: పదిహేనేళ్లుగా సిరిసిల్ల ప్రాంతంపై మాజీ మంత్రి కేటీఆర్ సవతిప్రేమను ఒలకబోశారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ని యోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆ దివారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. విలీన గ్రామాల అభిప్రాయాలను గౌరవించకుండానే మున్సిపల్లో కలిపిన కేటీఆర్ ఇప్పుడు జీపీలుగా మార్చుతామని మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సోయి ఏమైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని కచ్చితంగా నెరవేర్చుతుందనే రాజకీయ కుట్రకు తెరలేపారని విమర్శించారు. బతుకమ్మ చీరలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇక్కడి పరిశ్రమవర్గాలను మోసం చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అమలు చేస్తామన్న ఆరుగ్యారంటీలపై ఎలాంటి శషభిషలు అవసరం లేదన్నారు. దోపిడీదారులు ఆటో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమన్నారు. వారి సమస్యలను తమ సర్కారు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాల్టీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, విలీన గ్రామాల ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్, గోనె ఎల్లప్ప, జాలుగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు! -
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కోరిన ఎమ్మెల్యే కేటీఆర్..
రాజన్న సిరిసిల్ల: 'సిరిసిల్ల 2016లో అక్టోబర్‌లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అయితే సిరిసిల్ల పట్టణ జనాభా 83 వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయశ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరి.. అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సిరిసిల్లలో ఏడు గ్రామాలను 2018లో విలీనం చేశారు. ఫలితంగా 33 వార్డులుగా ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీ 39 వార్డులుగా మారింది. అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతోనే ఏడు గ్రామాలు మున్సిపల్లో కలిపారు.' - ‘సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలకు మినహాయింపునిస్తూ.. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపండి. ఆ ఏడు గ్రామాలు సిరిసిల్ల నుంచి విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందరితో చర్చించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి పంపితే ప్రభుత్వం పరిశీలిస్తుంది..’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు మంగళవారం సూచించారు. - ‘రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్ గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో బలవంతంగా విలీనం చేశారు. మున్సిపల్ నుంచి వేరు చేసి గతంలో మాదిరిగా ఆ పల్లెలను గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తాను. మీ ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తున్నాను..’ అని నవంబరు 28న సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. కోర్టుకెక్కిన పల్లెలు సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాల తరఫున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు సిరిసిల్లలో విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తార?శ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఏడు గ్రామాల విలీనం పూర్తయింది. ఆ పల్లెల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తిపన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి అంతంతే..! సిరిసిల్లలో విలీనమైన ఆ ఏడు గ్రామాల్లో అభివృద్ధి పనులు గత ఐదేళ్లలో అంతంతమాత్రంగానే జరిగా యి. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనా లు వార్డు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. గ్రామపంచాయతీ రికార్డులను మున్సిపల్‌కు అప్పగించారు. ఆ పల్లెల్లో పనిచేసే సిబ్బందిని సైతం మున్సి పల్లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే ఉపాధిహామీ పథకం ఆ ఏడు గ్రామాలకు దూరమైంది. మున్సిపల్ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. మొత్తంగా సిరిసిల్లలో విలీనమైన ఆ పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది. వేములవాడలో తెరపైకి డిమాండ్.. వేములవాడలోనూ ఇలాగే తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ గ్రామీణ ప్రజలు కూడా ప్రత్యేకంగా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. సిరిసిల్లలో విలీనబంధం వీడి తే.. అక్కడ కూడా ఇదే డిమాండ్ తెరపైకి వస్తుంది. కౌన్సిల్లో తీర్మానం జరిగేనా? సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో విలీన గ్రామాలను వేరు చేస్తూ తీర్మానం జరుగుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్లో కలి సిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. మళ్లీ ఆ గ్రామాలు పంచాయతీలుగా మారితే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల్లో భూములపై పెట్టుబడులు పెట్టారు. విలీనబంధం విడిపోతే ఏడు గ్రా మాలు దూరమై సిరిసిల్ల పట్టణ జనాభా తగ్గిపోయి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం పడిపోతుంది. ఇలాంటి కారణాలతో కౌన్సిల్లో ఏకాభిప్రా యం సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నా యి. ఒక వేళ కౌన్సిల్ తీర్మానం చేసినా.. ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో విలీన గ్రామా ల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
దోపిడీ పాలనను ప్రజలకు వివరించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల) : టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, దోపిడీ విధారనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీం నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పార్టీశ్రేణులను కోరారు. మండలా నికి చెందిన పలువురు యువకులు బుగ్గ కృష్ణమూర్తి నేతృత్వంలో మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మృత్యుంజయం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామంలో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, కేకే మ హేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పాటైం దన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో నియంత పా లన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, సాహెబ్, బండారి బాల్‌రెడ్డి, ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, కరికే శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, బానోత్ రాజునాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన సంస్కార హీనంగా మాట్లాడారు’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..తల్లి రొమ్ము గుద్దినట్లు కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ లేకపోతే.. కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. కేసీఆర్ మాఫియా మహారాజు.. కేటీఆర్ మాఫియా యువరాజు అని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న కేటీఆర్ చదివిన స్కూల్ ఎక్కడ పోయిందన్నారు. నడమంత్రపు సిరితో కేటీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పోకడను తెలంగాణ సమాజం ఈసడించు కుంటుందన్నారు. -
సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం
టీపీసీసీ నేత కె.కె.మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని టీపీసీసీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిరిసిల్లను జిల్లాగా చేయాలని శాంతియుతంగా అడుగుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు చేయడం, అరెస్టులు కావడం తెలంగాణ ప్రజలకు కొత్తకాదన్నారు.