మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
సిరిసిల్ల: పదిహేనేళ్లుగా సిరిసిల్ల ప్రాంతంపై మాజీ మంత్రి కేటీఆర్ సవతిప్రేమను ఒలకబోశారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ని యోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆ దివారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. విలీన గ్రామాల అభిప్రాయాలను గౌరవించకుండానే మున్సిపల్‌లో కలిపిన కేటీఆర్ ఇప్పుడు జీపీలుగా మార్చుతామని మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సోయి ఏమైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని కచ్చితంగా నెరవేర్చుతుందనే రాజకీయ కుట్రకు తెరలేపారని విమర్శించారు. బతుకమ్మ చీరలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇక్కడి పరిశ్రమవర్గాలను మోసం చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అమలు చేస్తామన్న ఆరుగ్యారంటీలపై ఎలాంటి శషభిషలు అవసరం లేదన్నారు. దోపిడీదారులు ఆటో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమన్నారు. వారి సమస్యలను తమ సర్కారు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాల్టీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, విలీన గ్రామాల ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్, గోనె ఎల్లప్ప, జాలుగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: కోటి ఆశలతో.. సీఎం హామీలపై నూతన సంవత్సరంలోకి అడుగులు!
Comments
Please login to add a commentAdd a comment