ప్రజలను మభ్యపెట్టెందుకే బీఆర్‌ఎస్‌పై విమర్శలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మభ్యపెట్టెందుకే బీఆర్‌ఎస్‌పై విమర్శలు..

Published Tue, Aug 1 2023 12:18 AM | Last Updated on Tue, Aug 1 2023 1:37 PM

- - Sakshi

రాజన్న: కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కోల్పోతోందనే భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఆ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్‌ చైర్ప్‌ర్సన్‌ జిందం కళ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతోనే సిరిసిల్ల పట్టణం అభివృద్ధి చెందిందన్నారు. పద్మశాలీల అభివృద్ధికి కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్‌ను పద్మశాలీ మహిళంతా ఓడిస్తామని కాముని వనిత పేర్కొనడం సరికాదన్నారు.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మహిళా కౌన్సిలర్లు ధర్నాం అరుణ, గడ్డం లత, పోచవేణి సత్య, ఒగ్గు ఉమ, జాగీరు శైలు, అడ్డగట్ల మాధవి, ఆడెపు సౌజన్య, కల్లూరి లత, రాపెల్లి అరుణ, బుర్ర లక్ష్మి, దార్ల కీర్తన, దిడ్డి మాధవి, తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement