మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం కోరిన ఎమ్మెల్యే కేటీఆర్‌.. | - | Sakshi
Sakshi News home page

కోర్టుకెక్కిన పల్లెలు! ‘విలీన’బంధం వీడేనా?

Published Wed, Dec 20 2023 11:48 PM | Last Updated on Thu, Dec 21 2023 2:03 PM

- - Sakshi

రాజన్న సిరిసిల్ల: 'సిరిసిల్ల 2016లో అక్టోబర్‌లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అయితే సిరిసిల్ల పట్టణ జనాభా 83 వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయశ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరి.. అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సిరిసిల్లలో ఏడు గ్రామాలను 2018లో విలీనం చేశారు. ఫలితంగా 33 వార్డులుగా ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీ 39 వార్డులుగా మారింది. అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతోనే ఏడు గ్రామాలు మున్సిపల్‌లో కలిపారు.'

- ‘సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలకు మినహాయింపునిస్తూ.. మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపండి. ఆ ఏడు గ్రామాలు సిరిసిల్ల నుంచి విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందరితో చర్చించి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానించి పంపితే ప్రభుత్వం పరిశీలిస్తుంది..’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళకు మంగళవారం సూచించారు.

- ‘రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్‌ గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్‌లో బలవంతంగా విలీనం చేశారు. మున్సిపల్‌ నుంచి వేరు చేసి గతంలో మాదిరిగా ఆ పల్లెలను గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తాను. మీ ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తున్నాను..’ అని నవంబరు 28న సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు.

కోర్టుకెక్కిన పల్లెలు
సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాల తరఫున పెద్దూరు, సర్దాపూర్‌ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు సిరిసిల్లలో విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తార?శ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఏడు గ్రామాల విలీనం పూర్తయింది. ఆ పల్లెల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తిపన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

అభివృద్ధి అంతంతే..!
సిరిసిల్లలో విలీనమైన ఆ ఏడు గ్రామాల్లో అభివృద్ధి పనులు గత ఐదేళ్లలో అంతంతమాత్రంగానే జరిగా యి. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనా లు వార్డు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. గ్రామపంచాయతీ రికార్డులను మున్సిపల్‌కు అప్పగించారు. ఆ పల్లెల్లో పనిచేసే సిబ్బందిని సైతం మున్సి పల్‌లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే ఉపాధిహామీ పథకం ఆ ఏడు గ్రామాలకు దూరమైంది. మున్సిపల్‌ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. మొత్తంగా సిరిసిల్లలో విలీనమైన ఆ పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది.

వేములవాడలో తెరపైకి డిమాండ్‌..
వేములవాడలోనూ ఇలాగే తిప్పాపూర్‌, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ గ్రామీణ ప్రజలు కూడా ప్రత్యేకంగా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. సిరిసిల్లలో విలీనబంధం వీడి తే.. అక్కడ కూడా ఇదే డిమాండ్‌ తెరపైకి వస్తుంది.

కౌన్సిల్‌లో తీర్మానం జరిగేనా?
సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో విలీన గ్రామాలను వేరు చేస్తూ తీర్మానం జరుగుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్‌లో కలి సిన గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ వచ్చింది. మళ్లీ ఆ గ్రామాలు పంచాయతీలుగా మారితే రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుంది. పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆయా గ్రామాల్లో భూములపై పెట్టుబడులు పెట్టారు. విలీనబంధం విడిపోతే ఏడు గ్రా మాలు దూరమై సిరిసిల్ల పట్టణ జనాభా తగ్గిపోయి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం పడిపోతుంది. ఇలాంటి కారణాలతో కౌన్సిల్‌లో ఏకాభిప్రా యం సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నా యి. ఒక వేళ కౌన్సిల్‌ తీర్మానం చేసినా.. ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో విలీన గ్రామా ల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇవి చ‌ద‌వండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement