పోడుపట్టాలు పంపిణీ చేస్తున్న రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
రాజన్న సిరిసిల్ల : మానాల, గిరిజన తండా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని అన్ని విధాలా అభివృద్ధి చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మానాల, గిరిజనతండా గ్రామాల్లో తాతమ్మవాగుపై రూ.2.2 కోట్లతో హైలెవెల్ బ్రిడ్రి, మానాల నుంచి గొర్రెగుండం వరకు రూ.1.12 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ చేసి, దెగావత్‌తండా జీపీ భవనాన్ని ప్రారంభించి, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజనులను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం సాధ్యం కాని హామీలతో ఆశలు రేపుతున్నారన్నారు. వారి మోసపూరిత హామీలు నమ్మొద్దని, గిరిజనుల కోసం పనిచేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు.
వేములవాడ ఆర్డీవో మధుసూదన్, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో మాలోతు శంకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు తొట్టిపాటి నర్సింహనాయుడు, రుద్రంగి బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దెగావత్ తిరుపతి, వైస్ ఎంపీపీ పీసరి చిన్న భూమయ్య, గిరిజన తండా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment