develop programs
-
తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలు పెట్టాలి?
అశోకుడు నాటిన చెట్లు చిన్నతనంలో సాంఘిక శాస్త్రంలో ‘అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను’ అని చదివేవాళ్ళం. అది నిజమేకానీ, అశోకుడు నాటించింది చెట్లు కాదు– మొక్కలు. ‘లీడర్’ కేవలం ‘పొలిటీషియన్’ మాత్రమే కాకుండా – ‘స్టేట్స్ మేన్’ కూడా అయితే, అతడి ఆలోచనలు ఇలా రాబోయే తరాల కోసం ఉంటాయి. ఏపీ రెండవ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే 26 జిల్లాల్లో పట్టణాలు–గ్రామా లకు విస్తరిస్తున్నాయి. అభివృద్ధి అంటే.. అభివృద్ధి అన్నప్పుడు... ఇది సముద్రతీర రాష్ట్రం కనుక, క్రమంగా ‘కాస్మోపాలి టిన్’గా మారుతున్న మన జీవనశైలి వైపు ‘రాజ్యం’ ప్రత్యేక నిఘా దృష్టి కనుక పెట్టకపోతే, మనదైన సహజ సాంఘిక ప్రత్యేకతను మనం కోల్పోతాం. ఇప్పటికే అటువంటి క్షీణత మొదలయింది.అభివృద్ధి తెస్తున్న – ‘కాస్మోపాలిటన్’ జీవనం దేశమంతా అన్ని ఆర్థికస్థాయి సమాజాల్లోకి ముంచు కొస్తుంటే, వాటిని ఎదుర్కోవడానికి ఆయా సమాజాల పక్షంగా ప్రభుత్వాలూ, పౌరవేదికలూ అప్రమత్తం అవుతూనే ఉన్నాయి. అయితే, ఆర్థిక సంస్క రణల అమలును 1995 నాటికే ఆహ్వానించిన తెలుగునాట పరిస్థితి మిగతా వాటికి భిన్నమైనది. తోసుకొచ్చిన హైటెక్ చదువులు అప్పట్లో ఇక్కడ తొలివేటు సామాజిక శాస్త్రాల చదువుల మీద పడింది. నిజానికి 80వ దశకం మధ్యలోనే అన్ని గ్రూపులకు డిగ్రీ స్థాయిలో కొత్తగా మొదలయిన– ‘కల్చర్ అండ్ హెరిటేజ్’ పేపర్‌తో సహా ‘సోషల్ సైన్సెస్’ చదువుల్ని ప్రభుత్వం నీరు గార్చింది.వీటి స్థానాల్లోకి పిల్లలు ఫీజులు కట్టి చదివే ‘హైటెక్’ కోర్సులు వచ్చాయి. అలా కొత్త తరాలకు క్లాస్ గదిలోనే – ‘పౌరశాస్త్రాల స్పృహ’ లేకుండా చేయడం జరిగింది. ఏవీ అంత తేలికగా రావు.. పొవు ఇది కేవలం సోయలేనితనంతో జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే, అప్పట్లో– ‘టూరిజం తప్ప మరే ఇజం లేదు’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనేవారు. సరే, మరి తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలెట్టాలి? అప్పట్లో ‘మెక్రో ఫైనాన్స్’ వ్యాపారం చేసే చీకటిశక్తులు గ్రామీణ కుటుంబ ఆర్థిక వ్యవస్థ లోకి జొరబడి క్రమంగా అది – ‘కాల్ మనీ’ రాకెట్‌గా జుగుప్సాకరమైన రీతిలోకి రూపాంతరం చెందింది. ఇక బడుగుల నివాసాల మధ్య ‘బెల్ట్ షాపులు’ మాట అయితే సరేసరి. ఇటువంటివి ఊళ్ళల్లోకి ఏ ఒక్క రోజో వచ్చినవి కాదు. అలాగే, వీటి మూలాలను కుదుళ్లకంటా పెకళించడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఇవి ఒక ఐదేళ్ల కాలంలో పైకి కనిపించి, మరో ఐదేళ్ల కాలంలో అదృశ్యమయేవి అంతకంటే కాదు. కష్టకాలంలోనూ సంక్షేమం రెండున్నర ఏళ్ల ‘కరోనా’ కాలాన్ని దాటుకుని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో నాలుగో ఏడాదికి చేరిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యాసంలో పైన చర్చించిన కంటికి కానని రుగ్మతలను గుర్తించి వాటిని ‘అడ్రెస్’ చేయడానికి అడుగులు వేస్తున్నది. ‘లీజర్ మేనేజ్మెంట్’ అనేది ఆరోగ్యకర సమా జాల్లో అత్యవసరమైన ప్రక్రియ. అందుకు పార్కుల నిర్మాణం వంటివి సాధారణంగా మనకు పైకి కనిపించేవి. ఆడుదాం ఆంధ్ర.. అయితే, నైపుణ్యాభివృద్ధి, నివాస ప్రాంతాల సమీపాల్లోనే ఉపాధి లభ్యత ఆర్థిక అంశం అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు వంటివి ఊళ్ళల్లో ఆబాల గోపాలానికి ఉత్సాహం నింపుతూ ఒక బృందం (టీమ్) పాటవ నిర్మాణానికి దారి తీసే అంశాలు. ఇందుకోసం రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ– ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నవంబర్ 15 నుండి డిసెంబర్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా– క్రికెట్, కబడి, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో అన్ని వయసుల యువతీ యువకులకు పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించను న్నారు. ఇందులో గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఇందుకోసం గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్ల కాలేజీల గ్రౌండ్స్ సిద్ధం చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. కొత్త నటుల కోసం డాటా బ్యాంక్ అలాగే రంగస్థల కళలను ప్రోత్సహిస్తూ ‘ఏపీ ఫిల్మ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఈ ఏడాది చివర ఉత్తమ నాటకాలకు – ‘నంది అవా ర్డులు’ ప్రదానం చేయబోతోంది. మన రాష్ట్రంలో షూటింగులు జరిగే సినిమా యూనిట్లకు స్థానికంగా నటులు కనుక అవసరమైతే, వారి వివరాలతో ఈ సంస్థ – ‘టాలెంట్ డాటా బ్యాంక్’ను సిద్ధంచేసింది. ఉదాహరణకు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వద్ద పనిచేస్తున్న సినిమా యూనిట్‌కు సబ్ ఇన్ స్పెక్టర్ పాత్రకు ఒక జూనియర్ నటుడు కావాలను కోండి. ఈ సంస్థ ‘వెబ్ సైట్’లోని ‘డేటా బ్యాంక్’లో వెతికితే, ఆ యూనిట్‌కు దగ్గర్లో ఆ పాత్ర పోషించే నటుల వివరాలు దొరుకుతాయి. ఈ ఆగస్టు నుంచి ఈ నటులకు సంస్థ ‘ఐ.డి. కార్డు’లను జారీ చేస్తు న్నది. ఇలా కొత్తవారికి అవకాశాలు అనేది మొదల యింది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల : మానాల, గిరిజన తండా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని అన్ని విధాలా అభివృద్ధి చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మానాల, గిరిజనతండా గ్రామాల్లో తాతమ్మవాగుపై రూ.2.2 కోట్లతో హైలెవెల్ బ్రిడ్రి, మానాల నుంచి గొర్రెగుండం వరకు రూ.1.12 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ చేసి, దెగావత్‌తండా జీపీ భవనాన్ని ప్రారంభించి, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజనులను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం సాధ్యం కాని హామీలతో ఆశలు రేపుతున్నారన్నారు. వారి మోసపూరిత హామీలు నమ్మొద్దని, గిరిజనుల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. వేములవాడ ఆర్డీవో మధుసూదన్, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో మాలోతు శంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు తొట్టిపాటి నర్సింహనాయుడు, రుద్రంగి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దెగావత్ తిరుపతి, వైస్ ఎంపీపీ పీసరి చిన్న భూమయ్య, గిరిజన తండా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్
సాక్షి, కడప : పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల చేరుకున్న సీఎం రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని.. ఆర్టీసీ బస్టాండ్, డిపోలకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక దేవాలయాల అభివృద్ధి, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీం, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. వచ్చే ఫిబ్రవరిలో వైఎస్ఆర్ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 5 సబ్స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అదనపు భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ‘వేంపల్లిలో డిగ్రీ కాలేజీకి నూతన శాశ్వత భవనాలను ఏర్పాటు చేస్తాం. నల్లపల్లిచెరువుపల్లిలో 130 కేవీ సబ్ స్టేషన్‌తో 14 గ్రామాలకు మంచి జరుగుతుంది. వేంపల్లిలో కమ్యూనిటీ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతున్నాం. పులివెందులలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. 18 కొత్త దేవాలయాలు, 51 దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వేంపల్లి ఉర్దూ కళాశాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ పనుల పురోగతి మరింత వేగవంతంగా సాగుతున్నాయి. పునరావాసంకు రూ. 665 కోట్లు.. గండికోట రిజర్వాయర్‌పై కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మార్చిలో ప్రారంభిస్తాం. రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పనులు చేపడుతున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం రాదు. గత 15 ఏళ్లలో లెక్కలు చూస్తే 20-25 రోజుల మాత్రమే పూర్తిస్థాయి నీరుంది. పులివెందుల ఆర్డీసీ డిపో పనులు డిసెంబర్ 25న ప్రారంభం కానున్నాయి. గండి వీరాంజనేయ క్షేత్రంలో గర్భాలయం, ధ్వజస్తంభం పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. గండికోటలో రిజర్వాయర్‌లో 26 టీఎంసీల పూర్తిసామర్థ్యాన్ని ఎప్పుడూ నింపలేదు. రూ.665 కోట్లతో పునరావాసం చెల్లించి 26.85 టీఎంసీల నీటిని నింపాం. రూ.247 కోట్లు R&R కింద ఇచ్చి చిత్రావతిలో 10.13 టీఎంసీల నీటిని నింపాం. గండికోట, చిత్రావతి నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి త్యాగాల వల్లనే లక్షలాది రైతులకు మేలు జరుగుతుంది. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నాను. నిర్వాసితులు చిరునవ్వుతో ఉండేలా చర్యలు తీసుకోవాలి.’ అని అన్నారు. -
కొత్త పుంతలు... పాత కంతలు!
ప్రణాళికా సంఘం రద్దయి కొత్తగా ఏర్పాటైన ‘నీతి ఆయోగ్’ పాలకమండలి తొలి సమావేశం తీరుతెన్నులు చూసినవారికి ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. అధికారంలోకొచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అత్యంత కీలకమైన తొలి విధాన నిర్ణయం నీతి ఆయోగ్ ఏర్పాటు. దాని స్వరూప స్వభావాల గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాలు కొత్త సంస్థపై పూర్తి అవగాహన కల్పించలేకపోయాయి. అయితే, ఆదివారంనాటి సమావేశంలో ప్రధాని చేసిన ప్రసంగం ఈ దిశగా కొంత ప్రయత్నం చేసింది. రాష్ట్రాల అవసరాల మేరకే పథకాలు రూపొందించడం...నిధులు, సాంకేతికతల్లో వాటికి సాధికారత కల్పించడం, సహకార సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. పై స్థాయిలో పథకాలు రూపొందించి రాష్ట్రాలపై రుద్దే పాత విధానానికి స్వస్తి పలికి...వాటి అవసరాలకు తగిన పథకాలు అమలుచేయడానికి సహకరిస్తామన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న పథకాల్లో కొన్నిటిని రద్దు చేయడం, మరికొన్నిటిని రాష్ట్రాలకు బదిలీ చేయడంవంటి ప్రతిపాదనలున్నాయి. అందుకోసం సీఎంలతో ఒక ఉపసంఘం కూడా ఏర్పాటుచేస్తారు. ఇదికాక రాష్ట్రాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ఒక ఉపసంఘం, నిరంతర ‘స్వచ్ఛ భారత్’ కోసం మరో ఉపసంఘం ఏర్పాటు కాబోతున్నాయి. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి అంశాల్లో రెండు టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కనుక ఆ రెండూ...వాటికి సంబంధించిన పథకాలూ ఇకపై రాష్ట్రాల పరిధిలోనే ఉండబోతాయన్న అభిప్రాయం కలుగుతుంది. సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మోదీ చెప్పారు గనుక ఆర్థిక విధానాల రూపకల్పనలో, ఆర్థికాభివృద్ధిలో కేంద్రమూ, రాష్ట్రాలూ కలిసి పనిచే స్తాయనుకోవచ్చు. రాష్ట్రాల అభిప్రాయాలకు విలువుంటుందని భావించవచ్చు. ప్రణాళికా సంఘం పనితీరు దీనికి భిన్నం. విధాన రూపకల్పన పూర్తిగా ఆ సంస్థే చూసుకునేది. ఆ విధానాలపై అది కేవలం రాష్ట్రాల అభిప్రాయాలను మాత్రమే అడిగేది. వాటి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే అమలు చేయించేది. నీతి ఆయోగ్ మాత్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రతిపాదనలేమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా పథకాలు రూపొందిస్తుందని చెబుతున్నారు. అయితే, దీన్నే వికేంద్రీకరణగా చెప్పడం సరికాదు. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు పూర్తిగా స్థానిక సంస్థలకివ్వడమే వికేంద్రీకరణలోని కీలకాంశం. స్థానిక సంస్థల కార్యకలాపాలను వెలుపలినుంచి సమీక్షిస్తూ, అవసరమైన సూచనలిస్తూ...అవి విజయవంతం కావడానికి తోడ్పడటం కేంద్ర, రాష్ట్రాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. అలా అయినప్పుడే అది నిజమైన వికేంద్రీకరణ అవుతుంది. అయితే, ఆ విషయంలో మోదీ ప్రసంగం స్పష్టత ఇవ్వలేదు. నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం కోరుతూ, వికేంద్రీకరణను ప్రస్తావించిన సీఎంలు స్థానిక సంస్థల విషయంలో మాత్రం తమ వైఖరేమిటన్నది చెప్పలేదు. ఇక నిర్మాణరీత్యా నీతి ఆయోగ్ కేంద్ర, రాష్ట్రాల ప్రతినిధులు...నిపుణులతో ఉండే మేథో బృందంగా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు... ఈ సంస్థలో పరిశోధన, కన్సల్టెన్సీ, టీమ్ ఇండియా విభాగాలుంటాయని తెలిపింది. ఈ వివరాలను చూస్తే రద్దయిన ప్రణాళికా సంఘానికీ, నీతి ఆయోగ్‌కు పెద్ద తేడా లేదనిపిస్తుంది. లోగడ ఉన్న ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉన్న జాతీయాభివృద్ధి మండలి(ఎన్డీసీ)కి జవాబుదారీగా ఉండేది. ఎన్డీసీ స్థానంలో ఇప్పుడు సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండే పాలకమండలి ఏర్పడింది. అయితే, ‘సహకార సమాఖ్య’కు ప్రతీకగా ఉండబోయే నీతి ఆయోగ్ తొలి సమావేశాలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు పాత పద్ధతిలోనే నిధుల గురించి, ఇతర సమస్యల గురించి కేంద్రానికి వినతులు చేసుకోవాల్సివచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకూ ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆర్థిక లోటును భరించే విషయంలోనూ కేంద్రం పార్లమెంటు వేదికగా ఎన్నో హామీలు ఇచ్చివున్నది. అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ కూడా అందుకు పట్టుబట్టింది. తీరా అధికారంలోకొచ్చాక ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఒకపక్క సహకార సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూనే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శించడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి? ఒక మెరుగైన వ్యవస్థ గురించి ఆలోచన చేస్తున్నవారు ఇలాంటి అంశాల్లో ఇంకా మూస వైఖరినే అవలంబించడం సరైంది కాదు. అటు తెలంగాణ సైతం వచ్చే వేసవి కాలంనాటికి రాష్ట్రం ఎదుర్కోబోయే విద్యుత్ సమస్యల గురించి ప్రస్తావించింది. ఆదుకోవాలని కోరింది. ఇక కేంద్రం ఆధ్వర్యంలో ఉండే పథకాలు నానాటికీ చిక్కిపోయి ఇప్పటికి 66 మిగిలితే వాటిని కూడా సాధ్యమైనంతవరకూ కుదించబోతున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం అటకెక్కడం ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల అమలు తర్వాత చాలా పథకాలు కనుమరుగయ్యాయి. సామాజిక బాధ్యతలను క్రమేపీ తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల్లో ఎన్ని మిగులుతాయో అనుమానమే. పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, అనారోగ్యంవంటివి ఇంకా సమస్యలుగానే మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం వంటివి కుదిస్తే దాని ప్రభావం గ్రామీణ పేదలపై తీవ్రంగా ఉంటుంది. నీతి ఆయోగ్ ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధికార వికేంద్రీకరణ గురించి సమీక్షించేటపుడు స్థానిక సంస్థల అధికారాల గురించి పట్టించుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన అర్ధంలో నూతన వ్యవస్థ ఆవిర్భవించిందన్న అభిప్రాయం కలుగుతుంది. లేనట్టయితే పేరులో తప్ప, పథకాల కోతలో తప్ప మిగిలిందంతా ఒకటేనన్న భావన ఏర్పడుతుంది.