
సాక్షి,నల్లగొండ: దామరచర్ల మండలం నునవత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంట ఏం జరిగిందో.. ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలకి విషమిచ్చి, తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment