
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పోలీసు వలయం మధ్యే హత్యకు గురవడాన్ని యూపీ పోలీస్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ సిఫార్సు మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు.
సస్పెన్షన్ వేటు పడిన వారిలో షాగంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ అశ్వనీకుమార్ సింగ్, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గత శనివారం ప్రయాగ్‌రాజ్‌లో రాత్రివేళ మెడికల్ చెకప్ కోసం అతీక్, అతని సోదరుడు ఆష్రాఫ్‌లను పోలీసులు వైద్యకళాశాలకు తీసుకెళ్తుండగా మీడియా సమక్షంలోనే ముగ్గురు నేరగాళ్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపి హత్యచేయడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment