లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అశ్రఫ్ ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అతీక్ మాఫియా డాన్‌గా ఉన్నప్పుడు చేసిన అరాచాకాలను కొందరు బాధితులు ఇప్పుడు వెల్లడిస్తున్నారు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ తమకు వెన్నులో వణుకుపుడుతోందని భయాందోళన వ్యక్తం చేశారు.
అతీక్ సోదరుడు అశ్రఫ్ ప్రయాణిస్తున్న కారును ఓవర్‌టేక్ చేసినంందుకు తన తమ్ముడ్ని అతీక్ దారుణంగా హత్య చేశాడని విజయ్ కుమార్ అనే వ్యక్తి వెల్లడించాడు. చిన్న చిన్న తప్పులకు కూడా అతీక్ కోర్టులో ఇలాంటి దారుణమైన శిక్షలు ఉండేవని ఆనాటి రోజులను గుర్తు చేసుకుని బోరున విలపించాడు.
(చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..)
'మీ జీవితంలో జరిగే కొన్ని ఘటనలు జీవితాంతం మిమ్నల్ని వెంటాడుతుంటాయి. ఆరోజు ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుంది. అంత్యక్రియల్లో పాల్గొని నేను నా తమ్ముడు కారులో ఇంటికి వెళ్తున్నాం. ఈ క్రమంలో మా ముందు ఉన్న కారును ఓవర్‌టేక్ చేశాం. అయితే అందులో అతీక్ సోదరుడు అశ్రఫ్ ఉన్నాడని మాకు తెలియదు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అతీక్ మమ్మల్ని ఇంటికి పిలిపించాడు. నా గురించి తెలియదా? మీరు తప్పు చేశారు? అని అన్నాడు. నా తమ్ముడ్ని ప్రాణాలతో విడిచిపెట్టమని నేను ఎంత బతిమిలాడినా కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా చంపాడు.' అని విజయ్ వివరించాడు.
1996లో ఈ ఘటన జరిగింది. అప్పుడు అతీక్ గ్యాంగ్‌స్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతను చెప్పిందే వేదం. అతడ్ని ఎవరూ ఎదిరించే సహాయం కూడా చేసేవారు కాదు. దీంతో అతీక్ అరాచాకాలకు హద్దే లేకుండా పోయింది. 27 ఏళ్లుగా ఈ ఘటనపై నోరువిప్పని విజయ్ కుటుంబం.. ఇప్పుడు అతీక్ హతమవ్వడంతో తమ గోడు వెల్లబోసుకుని కన్నీటిపర్యంతమైంది.
చదవండి: పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment