అధికారంలోకి రాగానే అక్రమ కబేలాపై చర్యలు చేపడతామన్న ఎన్నికల హామీని అమల్లోపెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథన్ మరో వాగ్దానం నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పోకిరీల ఆట కట్టించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు పోలీసులు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలు ఏర్పాటు చేశారు. లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు చేశారు. ప్రతి జిల్లాల్లోనూ యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.