ఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సమయస్పూర్తి ఓ కుటుంబ ప్రాణాలు కాపాడింది. ఆగ్రా హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్‌కు మంటలు అంటుకోవడం గమనించారు. అయితే బైక్ సైలెన్సర్ కింది భాగంలో మంటలు అంటుకోవడంతో దానిపై ప్రయాణిస్తున్నవారు గమనించకుండా అలానే ప్రయాణిస్తున్నారు. దూరం నుండే ప్రమాదం పసిగట్టిన పోలీసులు పెట్రోలింగ్ జీప్‌లో వారిని వెంబడించి, బైక్‌కు మంటలు అంటుకున్న విషయాన్ని చెప్పారు. వారిని బైక్ దూరంగా పంపించి పోలీసులు మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ కిందవైపు రోడ్డుకు రాపిడి జరగడంతో మంటలు వ్యాపించాయి.
ఈ ఘటన మొత్తాన్ని షూట్ చేసిన పోలీసులు వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోవైరల్‌గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను యూపీ డీజీపీ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment