పంజాబ్‌లో జైలు బద్దలు | Breaking out of the prison in Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో జైలు బద్దలు

Published Mon, Nov 28 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

పంజాబ్‌లో జైలు బద్దలు

పంజాబ్‌లో జైలు బద్దలు

‘ఖలిస్తాన్’ చీఫ్ హర్మిందర్‌తో పాటు మరో ఐదుగురు గ్యాంగ్‌స్టర్లను తప్పించిన దుండగులు
- పోలీసు దుస్తుల్లో జైల్లోకి ప్రవేశం.. గాల్లో 35 రౌండ్ల కాల్పులు
- తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కశ్మీరా సింగ్
- ఘటన జరిగిన రెండు గంటల్లోనే యూపీలో సూత్రధారి అరెస్టు
 
 పటియాలా/చండీగఢ్/న్యూఢిల్లీ:
నిరంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండే పంజాబ్‌లోని నభా జైలుపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో ఐదుగురు గ్యాంగ్‌స్టర్లను తప్పించి తీసుకెళ్లారు. తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కూడా అయిన కశ్మీరా సింగ్ ఉన్నాడు. దీంతో పంజాబ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పది తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న మింటూను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఘటన జరిగిన రెండు గంటల్లోనే.. తప్పించుకోవటంలో దాడి సూత్రధారి పర్మిందర్ సింగ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇతని నుంచి ఓ ఎస్సెల్లార్, మూడు రైఫిల్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను అందించిన సమాచారంతో తప్పించుకున్న వారంతా బృందాలుగా విడిపోరుు నేపాల్ చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. తప్పించుకున్న వారిలో ఖలిస్తాన్ చీఫ్ హర్మిందర్‌తో పాటు గ్యాంగ్‌స్టర్లు విక్కీ గౌండర్, అమన్‌దీప్ దోహతియాన్, గుర్‌ప్రీత్ సెకోన్, నీతా డియోల్, కశ్మీరా సింగ్‌లు ఉన్నారు. 2008లో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌పై దాడికి పాల్పడిన ఘటనతో పాటు మరో పది కేసుల్లో హర్మిందర్ నిందితుడు. కాగా, జైలుకు 20 కిలోమీటర్ల దూరంలో నాకాబందీని దాటి వెళ్తున్న వాహనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది.

 పోలీసు దుస్తుల్లో వచ్చి..: ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలు సెంట్రీ వద్దకు వచ్చి.. ఇద్దరు ఖైదీలను తీసుకొచ్చామని చెప్పి గేటు తీరుుంచారు. లోపలకు వెళ్లగానే సినీ ఫక్కీలో సెంట్రీతోపాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. గాల్లోకి దాదాపు 35 రౌండ్ల కాల్పులు జరిపి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారని డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. జైల్లో వీరిని కనీసం అడ్డుకునేందుకూ ఎవరూ ముందుకురాలేదు.

 నిర్లక్ష్యమా? కావాలనే చేశారా?: పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అత్యవసర భేటీ ఏర్పాటు చేసి.. ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటనపై బాదల్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జైలు బద్దలు కొట్టడంపై పంజాబ్ సర్కారు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు జైల్లోని అధికారులెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతోంది. ఉప ముఖ్యమంత్రి సుఖ్‌భీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. భయపడాల్సిందేమీ లేదని, వారెక్కడికీ(ఖైదీలు) తప్పించుకుపోలేరని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటన వెనక పాక్ హస్తం ఉండొచ్చన్నారు.
 
 కేఎల్‌ఎఫ్ చరిత్ర ఇదీ...
 సిక్కులకు ప్రత్యేక రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభమైన రాజకీయ జాతీయవాద పోరాటమే ఖలిస్తాన్ ఉద్యమం. ఇది క్రమేపీ మిలిటెంట్ రూపం సంతరించుకుంది. ఇందులో ముఖ్యపాత్ర పోషించిన సంస్థల్లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్‌ఎఫ్) ఒకటి. సాయుధపోరుతోనే సిక్కు రాజ్యం సాధ్యమనే సిద్ధాంతంపై ఇది ఏర్పాటైంది. దీన్ని 1986లో అరూర్, సుఖ్వీందర్ సింగ్‌లు స్థాపించారు. 1990 తొలినాళ్లలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసినప్పుడు దేశం విడిచి పారిపోరుున సంస్థ సభ్యులకు పాక్  ఆశ్రయం కల్పించిందన్న ఆరోపణలున్నారుు. కేఎల్‌ఎఫ్ హింసాత్మక దాడులకు పాల్పడింది.  పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను హత్య చేసింది. 1991లో ఢిల్లీలో రుమేనియా రాయబారిని అపహరించింది. అరుుతే సిక్కు నేతలు విమర్శించడంతో అతన్ని సురక్షితంగా విడిచిపెట్టింది. 1992, జూలై 29న  సంస్థ అప్పటి చీఫ్ గుర్జాంత్ సింగ్‌ను పోలీసులు హతమార్చారు. ఆ ఏడాది ఆగస్టులో కొత్త అధిపతి నవరూప్‌ను చంపామన్న పోలీసులు తర్వాత అతడు దేశం విడిచి పారిపోయాడన్నారు. 2005 దాక సంస్థ సభ్యుల అరెస్టులు సాగారుు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement