యోగి హయాంలో 420 ఎన్‌కౌంటర్లు
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టాక ఈ ఆరు నెలల్లో జరిగిన మొత్తం ఎన్‌కౌంటర్ల 420. ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శాంతి భద్రతలను కాపాడడం, నేరాలను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలను ఆయన గణాంకాలతో వివరిస్తూ తిప్పికొట్టారు. ఈ ఆరు నెలల్లో నేరాలను చాలా వరకు అదుపు చేయడంతో పాటు, శాంతి భద్రతలను పెంపొందించామని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ఇప్పటి వరకూ పోలీసులు 420 ఎన్‌కౌంటర్లు చేశారని ఆయన తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో 15 మంది నేరస్థులు చనిపోగా.. పలువురు గాయాలపాలై లొంగిపోయారని తెలిపారు.
చిత్రకూట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేరస్థులు జరిపిన కాల్పుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి చెందారని వివరించారు. నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు.