
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన ఓ18 ఏళ్ల యువతిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నోజిల్లాలోని ఓ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వారంతపు మార్కెట్‌కు వెళ్లడానికి గత సాయంత్రం బాధితురాలు సైకిల్‌పై ఇంటి నుంచి బయలు దేరింది. ఆ యువతిపై కొందరు దుండగలు పెట్రోలు పోసి నిప్పటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతి 100 శాతం గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామ శివారు పోలాల్లో ఓ మనిషిని కాల్చేశారనే వార్త ఉరంతా పాకింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు.
సైకిల్, చెప్పులు చూసి తమ కూతురే అని గుర్తుంచి బోరున విలిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో అగ్గిపెట్ట, సైకిల్, బాధితురాలి చెప్పులు పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగా యువతిని పెట్రోల్‌తే సజీవంగానే కాల్చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిందా లేదనే విషయం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తోందన్నారు.