Girl Burnt
-
దారుణం.. యువతిని కాల్చేశారు!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన ఓ18 ఏళ్ల యువతిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నోజిల్లాలోని ఓ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వారంతపు మార్కెట్‌కు వెళ్లడానికి గత సాయంత్రం బాధితురాలు సైకిల్‌పై ఇంటి నుంచి బయలు దేరింది. ఆ యువతిపై కొందరు దుండగలు పెట్రోలు పోసి నిప్పటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతి 100 శాతం గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామ శివారు పోలాల్లో ఓ మనిషిని కాల్చేశారనే వార్త ఉరంతా పాకింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు. సైకిల్, చెప్పులు చూసి తమ కూతురే అని గుర్తుంచి బోరున విలిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో అగ్గిపెట్ట, సైకిల్, బాధితురాలి చెప్పులు పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగా యువతిని పెట్రోల్‌తే సజీవంగానే కాల్చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిందా లేదనే విషయం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తోందన్నారు. -
మామిడి కాయల తగాదా.. యువతి హత్య!
ఫతేపూర్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయల కోసం చెలరేగిన వివాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా కేశాన్ గ్రామానికి చెందిన శివ్ భూషణ్ అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే కొంతమంది దుండగులు ఆ తోటలో మామిడికాయలను కోసేందుకు విఫలయత్నం చేశారు. ఆ క్రమంలో శివ్ భూషణ్ కు వారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే ఆ క్షణంలో అక్కుడ్నుంచి వెళ్లిపోయిన దుండగులు తరువాత శివ భూషణ్ ఇంటిపై దాడి చేశారు. కాగా, దాడికి పాల్పడ్డ సమయంలో ఇంట్లో శివ భూషణ్ కూతురు మాత్రమే ఉంది. దీంతో ఆ యువతిపై అతి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. అదే క్రమంలో యువతి ఒంటిపై కిరోసిన్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు ముందు అసలు విషయం తెలియలేదు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఆ దుండగులేనని తేలడంతో యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ దుండగులు ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదని తండ్రి శివ్ భూషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.