ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రష్యన్ ఎంబసీని మోసం చేసిన ఘరానా మోసగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు కావాలని రష్యన్ ఎంబసీ టెండర్స్ ఆహ్వానించింది. దీంతో గుంటూరుకు చెందిన రంగబాబు పథకం ప్రకారం టెండర్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఎంబసీ అధికారులు ఆన్‌లైన్ ద్వారా 42,500 యూఎస్ డాలర్లను రంగబాబుకు బదిలీ చేశారు.
అయితే డబ్బు తీసుకున్న నిందితుడు పనులు చేయకుండా తప్పించుకుని తిరిగాడు. దీంతో మోసం జరిగిందని తెలుసుకున్న ఎంబసీ అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు రంగబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకున్నందుకు తెలంగాణ, రాచకొండ పోలీసులను అభినందిస్తూ సీపీ మహేష్ భగవత్‌కు రష్యన్ ఎంబసీ వైస్ కౌన్సిల్ లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment