tendars scam
-
రష్యన్ ఎంబసీకే టెండర్
సాక్షి, హైదరాబాద్: రష్యన్ ఎంబసీని మోసం చేసిన ఘరానా మోసగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు కావాలని రష్యన్ ఎంబసీ టెండర్స్ ఆహ్వానించింది. దీంతో గుంటూరుకు చెందిన రంగబాబు పథకం ప్రకారం టెండర్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఎంబసీ అధికారులు ఆన్లైన్ ద్వారా 42,500 యూఎస్ డాలర్లను రంగబాబుకు బదిలీ చేశారు. అయితే డబ్బు తీసుకున్న నిందితుడు పనులు చేయకుండా తప్పించుకుని తిరిగాడు. దీంతో మోసం జరిగిందని తెలుసుకున్న ఎంబసీ అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు రంగబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకున్నందుకు తెలంగాణ, రాచకొండ పోలీసులను అభినందిస్తూ సీపీ మహేష్ భగవత్‌కు రష్యన్ ఎంబసీ వైస్ కౌన్సిల్ లేఖ రాసింది. -
మెడ్‌టెక్ జోన్ టెండర్లలో గోల్మాల్?
విశాఖపట్నం: మెడ్‌టెక్ జోన్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని మెడ్‌టెక్ జోన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జుడీష్‌రాజు, రామరాజులు ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలను వారు మీడియాకు అందజేశారు. మౌలిక వసతుల కల్పన టెండర్లలో అవకతవకలు జరిగాయని, రూ.500 కోట్ల పనులకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలవగా ఎక్కడా లేని విధంగా 387 శాతం అధిక మొత్తానికి అంటే రూ.2,432 కోట్లకు టెండర్లను ల్యాంకో సంస్థకు ఖరారు చేశారని చెప్పారు. అవినీతిపై ప్రశ్నించినందుకు జోన్ 8 మంది అధికారులను వైద్య ఆరోగ్య శాఖ తొలగించిందని తెలిపారు. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సీఈఓ జితేంద్రశర్మ, కామినేని ఓఎస్డీ అంకం సోదరులపై వీరు ఆరోపణలు చేశారు. అలాగే 108 వాహనాల కాంట్రాక్టులోనూ అక్రమాలు జరిగాయని, 76 వాహనాలను ఇంట్రో మెడిక్స్కు అధిక మొత్తానికి అప్పగించారని ఆరోపించారు.