Russian embassy
-
రష్యా ఎంబసీ వద్ద టెన్షన్.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి!
తాలిబన్ పాలిత ఆప్ఘనిస్తాన్‌లో కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతిచెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చిచంపినట్టు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు. కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇటీవలే హెరాత్ ప్రావిన్స్‌లో గుజార్గా మసీదులోనూ శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడులో మతపెద్ద ముజీబ్ ఉల్ రెహ్మాన్ అన్సారీ, అతని భద్రతా సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. At least 25 people were killed and injured in an explosion near the #Russian embassy in #Kabul. Russian Foreign Ministry says 2 employees of the Russian Embassy in Kabul were killed today's bomb blast on Darulaman road in Kubal.#Afghanistan#KubalBlast pic.twitter.com/EYlWEGaNGi — Kamran Khan Afridi (@Kamrankhan1432) September 5, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో భారత మహిళలపై జాతివివక్ష దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ.. -
మాట మార్చిన పుతిన్: యుద్ధాన్ని ఆపేందుకే మిలిటరీ ఆపరేషన్!
Goal Of Russias Military Operation: ఉక్రెయిన్ రష్యాల మధ్య సాగుతున్న నిరవధిక పోరు నేటికి 13వ రోజుకి చేరుకుంది. అయితే యూకేలో రష్యన్ రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని మిలటరీ ఆపరేషన్ లక్ష్యం యుద్ధాన్ని ఆపడమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ విక్టోరోవిచ్ లావ్రోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ..ఇది పచ్చి అబద్ధం అని ఖండించారు. అంతేకాదు అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని రష్యన్ మాట్లాడే వర్గాలను రక్షించడమే లక్ష్యంగా 'మిలిటరీ ఆపరేషన్' అని పేర్కొన్నారు. పైగా రష్యాను బెదిరించడానికి ఉక్రెయిన్ను ఉపయోగించకుండా నిరోధించడం అని కూడా చెప్పారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్ వాదనను యుద్ధానికి నిరాధారమైన సాకుగా అభివర్ణించాయి. కానీ ఇప్పుడేమో రష్యా ఎంబసీ ఉక్రెయిన్ భూభాగంలో జరిగే యుద్ధాన్ని ఆపేందుకే ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అయితే అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడమే కాక మాస్కో దురాక్రమణకు అడ్డుకట్టవేసేలా ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు రష్యా సాయుధ బలగాలు రాజధాని కైవ్‌ని సోంతం చేసుకుంటాం లొంగిపోండి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బెదిరించడమే కాక ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల బాంబుల వర్షంతో విరుచుకుపడింది. ఈ యుద్ధ విధ్వసం కారణంగా సుమారు 331 మందికి పైగా పౌరులు మరణించినట్లు యూఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. FM #Lavrov: The goal of Russia’s special military operation is to stop any war that could take place on Ukrainian territory or that could start from there. pic.twitter.com/tLf7798DIh — Russian Embassy, UK (@RussianEmbassy) March 7, 2022 (చదవండి: ఓవైపు యుద్ధం.. మరోవైపు తరలింపు!! రష్యా-ఉక్రెయిన్ చెరోమాట) -
రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ
హైదరాబాద్: తెలుగుతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. విడుదలై దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ల వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు వారాల క్రితం బాహుబలి 2 సినిమా రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ శుక్రవారం ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (9న సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ) 39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో(2017లో జరిగింది) బాహుబలి చిత్రాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రసంగించారు. (మహేశ్‌వారి పాటలు!) రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ నెమరువేసుకుంటూ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ వేడుకలకు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు. ఇక గత నెల 28న బాహుబలి-2 చిత్రం రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. While presenting #Baahubali2 at the Moscow Film Festival, director @SSRajamouli explained how the movie promotes Indian values all over the world. Here is was he said. pic.twitter.com/g257hAk9K3 — Russia in India (@RusEmbIndia) June 5, 2020 -
‘రష్యా’కే టోకరా వేశాడు..
న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయాన్నే మోసగించి 42,500 అమెరికన్ డాలర్లు( రూ.28 లక్షలు) కొట్టేశాడో మోసగాడు. కార్యాలయంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా పనులు చేజిక్కించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు...ముందుగా డబ్బులు తీసుకుని పనులు చేయకుండా తప్పించుకోవడంతో రష్యన్ కార్యాలయ సెక్రటరీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రంగబాబును గుర్తించి పట్టుకున్నారు. గచ్చిబౌలి: న్యూఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో రాడార్ ఏర్పాటుకు ఆన్లైన్లో పనులు చేజిక్కించుకున్న వ్యక్తి మొత్తం డబ్బులు తీసుకుని పరారు కాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని డబ్బు రికవరీ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో ఎస్ఐఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఏర్పాటు కోసం 2016 మే నెలలో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. సరూర్‌నగర్‌లోని కేఆర్‌బీ జీఈఐఓ సర్వీసెస్ సీఈఓగా వ్యవరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు ఆన్లైన్ రాడార్ ఏర్పాటు టెండరు దాఖలు చేసి 42,500 అమెరికన్ డాలర్లు(రూ.28 లక్షలు)లకు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు. మొత్తం డబ్బు తన ఖాతాలో జమ చేస్తేనే పనులను ప్రారంభిస్తానని చెప్పడంతో రష్యన్ ఫెడరేషన్ రాయబార కార్యాలయం సదరు మొత్తాన్ని రంగబాబు అకౌంట్లోకి బదిలీ చేసింది. జీఎస్టీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొంత డబ్బు కావాలని కోరగా, రష్యన్ అధికారులు అంగీకరించలేదు. దీంతో అతను పనులు ప్రారంభించకపోగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో సదరు కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ 2017 సెప్టెంబర్ 29న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయగా, సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హుడా కాలనీలో అతడికోసం గాలించగా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లినట్లు గుర్తించారు. గుంటూరులోని మారుమూల ప్రాంతంలో రంగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్న మొత్తాన్ని రష్యన్ ఫెడరేషన్ రాయబారి అకౌంట్లోకి జమ చేయించినట్లు తెలిపారు. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా రంగబాబు వ్యవహరించాడని కేసును దర్యాప్తు చేసిన డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వేణుగోపాల్, సీఐ రంగస్వామిలను సీపీ అభినందించారు. డబ్బు తిరిగి అకౌంట్లో జమ కావడంతో కోర్టులో కేసు ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడటం గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వడం రంగబాబుకు పరిపాటేనని పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ప్రశంస... సీపీ మహేశ్ భగవత్‌తో పాటు రష్యన్ ఫెడరేషన్ రాయబారి కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ రాయబారి నికోలాస్ కుదసెవ్ అభినందనలు తెలిపిన లేఖను చదివి వినిపించారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన తీరును ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రష్యన్ ఎంబసీకే టెండర్
సాక్షి, హైదరాబాద్: రష్యన్ ఎంబసీని మోసం చేసిన ఘరానా మోసగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కార్యాలయానికి రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు కావాలని రష్యన్ ఎంబసీ టెండర్స్ ఆహ్వానించింది. దీంతో గుంటూరుకు చెందిన రంగబాబు పథకం ప్రకారం టెండర్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఎంబసీ అధికారులు ఆన్లైన్ ద్వారా 42,500 యూఎస్ డాలర్లను రంగబాబుకు బదిలీ చేశారు. అయితే డబ్బు తీసుకున్న నిందితుడు పనులు చేయకుండా తప్పించుకుని తిరిగాడు. దీంతో మోసం జరిగిందని తెలుసుకున్న ఎంబసీ అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు రంగబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకున్నందుకు తెలంగాణ, రాచకొండ పోలీసులను అభినందిస్తూ సీపీ మహేష్ భగవత్‌కు రష్యన్ ఎంబసీ వైస్ కౌన్సిల్ లేఖ రాసింది. -
అమెరికాపై రష్యా ప్రతీకారం..!
ప్రచ్చన్న యుద్ధం పునఃప్రారంభమైందా? అనే స్థాయిలో అమెరికా, రష్యాలు ఒకరిపై మరొకరు అస్త్రాలను సంధించుకుంటున్నారు. అమెరికాలో పనిచేస్తోన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై ఒబామా సర్కారు బహిష్కరణవేటు వేసిన గంటల వ్యవధిలోనే రష్యా కూడా ప్రతికారానికి దిగింది. రష్యాలో పనిచేస్తోన్న 35 మంది అమెరికన్ దౌత్య అధికారులపై వేటే వేసేందుకు పుతిన్ సర్కారు పూనుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. అంతేకాదు.. తన భూభాగం(మాస్కో)లోని ఆంగ్లో అమెరికన్ స్కూలును రష్యా ప్రభుత్వం మూసేయించినట్లు కూడా వార్తలు ప్రసారం అయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా దాదాపు అన్నిదేశాలతో మైత్రి కొనసాగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. చివరి రోజుల్లో మాత్రం ప్రచ్చన్న యుద్ధాన్ని పునఃప్రారంభించినట్లు సంకేతాలు పంపుతున్నారు. మొన్న ఐక్యరాజ్యసమితో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించి, నిన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా దౌత్యాధికారులు హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, తద్వారా డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా, ట్రంప్‌కు అనుకూలంగా వ్యవస్థను నడిపించారని ఒబామా ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఒబామా ఇంకో 20 రోజుల్లో గద్దెదిగిపోనున్న నేపథ్యంలో రష్యా, ఇజ్రాయెల్‌లపై విధించిన ఆంక్షలు ఏమేరకు కొనసాగుతాయనేది అనుమానమే. అమెరికాలో పనిచేస్తోన్న తమ 35 మంది దౌత్యాధికారులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లోని రష్యా రాయబార కార్యాలయం శుక్రవారం ట్వీట్ బాంబు పేల్చింది. 'ఒబామా నిర్ణయం కోల్డ్ వార్‌ను తలపించేలా ఉంది. తన చివరి రోజుల్లో ఆయనలా ఏదోఒకటి చేయడం వల్ల అమెరికన్లు సహా చాలామంది గర్విస్తారు' అనే కామెంట్ తోపాటు ఒబామాను లేమ్డక్తో పోల్చుతూ ఫొటోను పోస్ట్ చేసింది. (అధ్యక్ష పదవికి ఎన్నికైన అభ్యర్థి పదవీ స్వీకారం చేసేదాకా కొనసాగే పాత అధ్యక్షుడిని ‘లేమ్ డక్’గా వ్యవహరిస్తారు) చివరి రోజుల్లో ఒబామా సర్కారు తీసుకుంటోన్న వివాదాస్పద నిర్ణయాల్లో కొన్నింటిని వ్యతిరేకిస్తోన్న కాబోయే అధ్యక్షుడు ట్రంప్.. 'రష్యా దౌత్యాధికారులపై వేటు'పై ఆచితూచి స్పందించారు. అతి త్వరలోనే ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై ఈ వ్యవహారంపై చర్చిస్తానన్నారు. ఐరాసలో ఇజ్రాయెల్‌పై అభిశంసన విషయంలో మాత్రం ట్రంప్ బాహాటంగానే ఒబామాను తప్పుపట్టారు. -
రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి!
కాబూల్: కాబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వ రవాణా బస్సును టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. చాలామంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది. రష్యా దౌత్య కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. దీంతో రష్యా దౌత్య కార్యాలయాన్నే టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారా అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదులు వరుసగా, ఇండియా, పాకిస్థాన్ దౌత్య కార్యాలయాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. తాజా రష్యా దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని దాడికి దిగినట్లయితే మున్ముందు మరిన్ని దేశాల దౌత్య కార్యాలయాలపై కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదు. -
ఢిల్లీలో అర్ధరాత్రి రష్యా దౌత్యవేత్త వీరంగం
న్యూఢిల్లీ: రష్యా దౌత్యవేత్త మద్యంమత్తులో మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ వీధుల్లో వీరంగం సృష్టించాడు. కారుతో బైకును ఢీకొట్టి ఇద్దరిని గాయపరచడంతో పాటు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. రష్యా దౌత్యాధికారి మద్యంమత్తులో వేగంగా కారు నడుపుతూ మోతీ బాగ్‌లో ఓ మోటార్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ తతంగాన్ని గమనించిన పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించగా.. రష్యా దౌత్యవేత్త తన కారును ఆపకుండా పోలీస్ బ్యారికేడ్‌పై దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. కారు దిగేందుకు నిరాకరించిన ఆయన ఓ కానిస్టేబుల్‌పై చేయి చేసుకుని దూషించాడు. దౌత్యాధికారి స్నేహితుడు పోలీసులతో మాట్లాడి ఆయన్ను తీసుకెళ్లాడు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయానికి తెలియజేసి.. ఆయనపై కేసు నమోదు చేశారు.