రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి! | More than a dozen dead and injured in a suicide bombing against a civilian bus close to Russian embassy | Sakshi

రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి!

Jan 20 2016 7:19 PM | Updated on Nov 6 2018 8:35 PM

రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి! - Sakshi

రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి!

కాబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వ రవాణా బస్సును టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

కాబూల్: కాబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వ రవాణా బస్సును టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. చాలామంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది. రష్యా దౌత్య కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది.

దీంతో రష్యా దౌత్య కార్యాలయాన్నే టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారా అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదులు వరుసగా, ఇండియా, పాకిస్థాన్ దౌత్య కార్యాలయాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. తాజా రష్యా దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని దాడికి దిగినట్లయితే మున్ముందు మరిన్ని దేశాల దౌత్య కార్యాలయాలపై కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement