ఢిల్లీలో అర్ధరాత్రి రష్యా దౌత్యవేత్త వీరంగం | Drunk Russian diplomat rams into biker; punches, abuses Delhi cop | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అర్ధరాత్రి రష్యా దౌత్యవేత్త వీరంగం

Published Wed, Dec 9 2015 10:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

ఢిల్లీలో అర్ధరాత్రి రష్యా దౌత్యవేత్త వీరంగం

ఢిల్లీలో అర్ధరాత్రి రష్యా దౌత్యవేత్త వీరంగం

న్యూఢిల్లీ: రష్యా దౌత్యవేత్త మద్యంమత్తులో మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ వీధుల్లో వీరంగం సృష్టించాడు. కారుతో బైకును ఢీకొట్టి ఇద్దరిని గాయపరచడంతో పాటు ఓ కానిస్టేబుల్పై దాడి చేశాడు.


రష్యా దౌత్యాధికారి మద్యంమత్తులో వేగంగా కారు నడుపుతూ మోతీ బాగ్లో ఓ మోటార్ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ తతంగాన్ని గమనించిన పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించగా.. రష్యా దౌత్యవేత్త తన కారును ఆపకుండా పోలీస్ బ్యారికేడ్పై దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. కారు దిగేందుకు నిరాకరించిన ఆయన ఓ కానిస్టేబుల్పై చేయి చేసుకుని దూషించాడు. దౌత్యాధికారి స్నేహితుడు పోలీసులతో మాట్లాడి ఆయన్ను తీసుకెళ్లాడు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయానికి తెలియజేసి.. ఆయనపై కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement