
సాక్షి, మెదక్: ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ అదృశ్యమైన సంఘటన అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్‌పూర్ పరిధి కేఎస్‌ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా ఇటీవల ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో 14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా అతడి ఆచూకీ లభించలేదు. తమ్ముడి అదృశ్యంపై అన్న మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే!
Comments
Please login to add a commentAdd a comment