అమెజాన్‌ మోసం.. పార్సిల్‌ ఓపెన్‌ చేయగానే అవాక్కైన కస్టమర్‌ | Online Fraud: Amazon Customer Received Fake Item Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Amazon: అమెజాన్‌ మోసం.. పార్సిల్‌ ఓపెన్‌ చేయగానే అవాక్కైన కస్టమర్‌

Published Mon, Nov 29 2021 8:33 AM | Last Updated on Mon, Nov 29 2021 11:16 AM

Online Fraud: Amazon Customer Received Fake Item Andhra Pradesh - Sakshi

అమెజాన్‌లో వచ్చిన కాక్‌లు ఇవే

సాక్షి,గరుగుబిల్లి(విజయనగరం): మండలంలోని నాగూరుకు చెందిన గొట్టాపు భార్గవ నాయుడు ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాడు. షటిల్‌ కాక్‌లకు అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఆర్డర్‌ ఇస్తే ఆదివారం  వచ్చిన పార్శిల్‌లో పనికిరానివి, కాక్‌లకు డిప్పలు లేనివి ఉండడంతో ఆవాక్కయ్యాడు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మోసం జరిగిందని గ్రహించి వెంటనే ఆ సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి తిప్పి పంపించేశాడు. 

పాముకాటుతో వ్యక్తి మృతి 
రేగిడి: మండల పరిధిలో ని అంబకండి గ్రామానికి చెందిన లొట్టి అచ్యుతరావు (45) ఆదివారం పాముకాటుతో మృతి చెందారు. గడ్డి కోత కోసం ఆయన సాయంత్రం పొలానికి వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా గట్టుపై అ పస్మారక స్థితిలో పడి ఉన్నా రు. వారు అచ్యుతరావును రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని ఎంపీటీసీ పుర్లి సత్యవతి తెలిపారు. అచ్యుతరావుకు భార్య అన్నపూర్ణ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె నీలిమ, కుమారుడు ఉన్నారు. అచ్యుతరావు గీత కార్మికుడు. ఆయన మృతితో కుటుంబానికి ఆధారం పోయింది. అచ్చుతరావు మృతిపై మాజీ సర్పంచ్‌ లావేటి అప్పలనాయుడు, లావేటి గణపతిరావునాయుడు, పుర్లి గోపాలకృష్ణ మాస్టారు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement