ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కుచ్చుటోపి | Online Fraudsters Cheat MLC Ramachandar Rao For Rs.35,000 | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కుచ్చుటోపి

Published Sun, Jan 21 2018 11:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Online Fraudsters Cheat MLC Ramachandar Rao For Rs.35,000 - Sakshi

బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ విధానమండలి బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ రామచందర్‌ రావుకు ఆన్‌లైన్‌ మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయనకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల నుంచి సైబర్‌ నేరస్తులు రూ. 35 వేలు దోచేశారు.

ఈ నెల 1వ తేదీన సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో రెండు అకౌంట్ల(ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ అకౌంట్లు) నుంచి రూ. 35 వేలు కట్‌ అయినట్లు రామచందర్‌ రావుకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్‌కు గురైన ఎమ్మెల్సీ ఈ నెల 3వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. కేసు వివరాలను తెలుసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement