ramachander rao
-
‘కేటీఆర్ ఎక్కడ.. 12 కోట్ల జాబులను వెతుకుతున్నాను’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. అధికార పక్షం, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల కల్పన మీద అధికార పార్టీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ తాము ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించామని చెప్పగా.. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా చర్చకు రావాల్సిందిగా బీజేపీ నాయకుడు రామ చందర్ రావు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. దీనికి బదులుగా కేటీఆర్ బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్తానన్నారు. సవాల్ ప్రకారం రామచందర్ రావు సోమవారం ఉదయం ఓయూకు వెళ్లారు. కేటీఆర్ అక్కడకు రాలేదని తెలుపుతూ రామచందర్ రావు ట్వీట్ చేశారు. 'నేను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నాను.. ఎక్కడున్నావు మిస్టర్ కేటీఆర్?' అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ రామచందర్ రావుకి కేటీఆర్ చురకలంటించారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు ‘‘మీరు అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు(ఇప్పటి వరకు 12 కోట్ల జాబ్స్).. జన్‌ధన్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పారు కదా. వీటిని ఎంత వరకు నెరవేర్చరా అనే దాని గురించి సమాచారం సేకరించే పనిలో నేను బిజీగా ఉన్నాను. దీనికి ఎన్డీఏ సమాధానం చెప్పాలి. అసలు ఎన్డీఏ అంటే నో డాటా అవైలబుల్’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం ఉంటే షేర్ చేయాలని ఆయన సవాలు విసిరారు. I am busy gathering information on the 12 crore jobs (2Cr per year) & ₹15 lakhs in all Jandhan accounts promised by Hon’ble PM Shri Modi Ji NDA is the answer so far N - No D - Data A - Available Please share if you have any answers https://t.co/NQf2FFF74z — KTR (@KTRTRS) March 1, 2021 చదవండి: 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం పట్టభద్రుల పోరు.. బరిలో కోటీశ్వరులు -
'వారి ధనబలం ముందు ఓడిపోయాం'
సాక్షి, హైదరాబాద్: హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ధనబలం ముందు ఓడిపోయామని బీజేపీ ఎమ్మెల్సీ నరపరాజు రామచంద్రరావు అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార బలంతో టీఆర్ఎస్ గెలించిందని, అయినా టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హుజుర్నగర్ గెలుపుతో అహంకారం పెంచుకోవద్దన్నారు. స్థానికంగా హుజుర్నగర్లో బీజేపీ బలంగా లేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అహంకారాన్ని పక్కన బెట్టి, ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లు, లీగల్ బాడీస్ కార్మికులకు.. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేమో అనే అంశంపై వారికి స్పష్టత ఇవ్వాలన్నారు. కార్మికులకు పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలకు, కోర్టుకు పోవద్దంటే.. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కో విధానం ఉందని, ఆర్టీసీని అంతమొందించాలని చూస్తున్నారని ఆరోపించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు.. ఆర్టీసీని అణిచివేయడానికి ఆమోదముద్ర కాదన్నారు. ఉన్నపళంగా 48 వేల మంది కార్మికులను తీసేస్తే.. అందుకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నేతలపై.. ఎందుకు ప్రధాని మోదీకి లేఖ రాశారని ప్రశ్నించారు. ఇప్పటివరకూ రైల్వే ప్రైవేటికరణ జరగలేదని, ప్రయోగాత్మకంగా ప్రయివేట్ రైలు నడిపిందని తెలిపారు. -
ఉన్నత విద్యలో సమూల మార్పులు
స్వాతంత్య్రానంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్య క్షతన ఏర్పడిన తొలి విద్యా కమిషన్, విద్య లక్ష్యం నూతన ఆవిష్కరణలకు, నవకల్పనలకు, నవభారత దేశ స్వావలంబనకు దోహ దపడే విజ్ఞాన సముపార్జ నగా ఉండాలని అభిప్రాయ పడింది.విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, ఉన్నత విద్య నిరంతర పరిశోధనా స్థానంగా, నవ కల్పనలకు నిలయంగా ఉండాలని ఈ కమిషన్ భావించింది. బాధాకరమైన విషయ మేమంటే, 2009లో వచ్చిన నాలెడ్జ్ కమిషన్ నివేదిక కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాల్సి వచ్చింది. ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాల నిర్ధారణ, సమన్వయానికి 1956లో విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ) ఏర్పడింది. ఆనాటికి దేశంలో 20 విశ్వవిద్యాలయాలు, 500 కళాశాలలు ఉన్నాయి. సుమారు 2.10 లక్షలమంది విద్యార్థులు అప్పట్లో ఉన్నత విద్యారంగంలో చదువుతున్నారు. యూజీసీ ఏర్పడిన 62 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా రంగంలో విద్యార్థుల స్థూల నమోదు 25.5 శాతానికి, విద్యార్థుల నమోదు 3 కోట్ల 66 లక్షలకు చేరింది. కానీ ఉన్నత విద్యారంగంలో మారుతూ వచ్చిన పరి ణామాలకు అనుగుణంగా లేదా ప్రపంచ మార్పు లకు అనుగుణంగా యూజీసీని సంస్కరించాలని గత ప్రభుత్వాలు భావించలేదు. ప్రపంచీకరణ అనం తరం దేశంలో పెద్ద ఎత్తున అన్ని రకాల విద్యా సంస్థలు వెలిశాయి. కానీ ప్రమాణాల విషయంలో చెప్పుకోదగిన సంస్థ ఒక్కటీ లేదు. రాన్రానూ పని భారంతో యూజీసీ పాలనాపరమైన వ్యవహారాలకే పరిమితమవుతూ వచ్చింది. యూజీసీ తన 62 ఏళ్ల చరిత్రలో అంతర్జాతీయంగా ప్రభావంగల కనీసం ఒక్క ఆవిష్కరణకైనా దోహదపడినట్టు ప్రకటించు కోలేకపోయింది. గతంలో ఎన్నో కమిషన్లు యూజీ సీని పునర్ వ్యవస్థీకరించాలని సూచించాయి. ఇతర కమిటీలు కూడా మార్పు ప్రాధాన్యతను తెలియజే యడంతో యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో భారత ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ), నీతి ఆయోగ్, జీఎస్టీ కౌన్సిల్ తర హాలో జాతీయ సంస్థగా ఏర్పడుతుంది. ఇందులో రాష్ట్రాల విద్యామంత్రులు, రాష్ట్రాల హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్పర్సన్లు సభ్యు లుగా ఉంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. ఉన్నత విద్యా రంగానికి చెందిన అన్ని అంశాలపై తగిన చర్చ అనంతరం ఈ మండలి నిర్ణ యాలు తీసుకుంటుంది. ఈ బిల్లు మరింత సమర ్థవంతమైన క్రెడిట్ల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. విద్యార్థి ఫెయిల్ అయితే ఒక ఏడాది కోల్పోయేలా కాకుండా డిగ్రీ పట్టాకు అర్హత సాధించడానికి నిర్ణీత క్రెడిట్లు పొందే వీలు కల్పిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే స్థానిక అవసరాలకు అనుగుణంగా తమ పాఠ్య ప్రణాళికను రూపొందించుకునేందుకు ఈ బిల్లు మరింత స్వేచ్ఛ కల్పిస్తుంది. ఉదాహరణకు ఆదిలాబాద్‌లో ఏర్పడబోయే గిరిజన విశ్వవిద్యాల యానికి యూజీసీ, పాఠ్య ప్రణాళిక రూపొందించ డంలో అర్థం ఉండదు. ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన ప్రతి సంస్థా తు.చ. తప్పకుండా పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం జరుగుతోంది. అలా పాటించని, తగిన పనితీరు కనబరచని సంస్థలను చట్టప్రకారం మూసి వేయడం జరుగుతుంది. అయితే, గ్రాంట్లు కేటాయించే అధి కారాన్ని ఈ బిల్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు కూడా కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి అవకాశం ఇస్తుం దన్న అంశాలపై ఈ బిల్లు విమర్శలకు గురౌతోంది. నిధుల కేటాయింపు అధికారాన్ని నేరుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తనకు తానుగా తీసుకోవడం కాకుండా ఆ మంత్రిత్వ శాఖ కింద విద్యారంగ నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లతో కూడిన స్వతంత్ర ఏజెన్సీకి అప్పగించాలని పలువురు అభి ప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణల విషయంలో చొరవ తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్లు అభినందనీయులు. ప్రపంచం లోని అత్యున్నత స్థాయి పది విశ్వ విద్యాలయాలలో కనీసం ఒక భారతీయ విశ్వవిద్యాలయం ఉండే విధంగా చూసేలా భారతీయ ఉన్నత విద్యామండలి ఏ విధంగా ముందుకు పోతుందన్న దానికి కాలమే సాక్ష్యం. రాగల కాలంలో ఈ ప్రతిష్టాత్మక స్థాయిని సాధించడమే మనం, తత్వవేత్త, పాలనాదక్షుడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అర్పించే ఘన నివాళి అవుతుంది. వ్యాసకర్త: ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ మెయిల్ : n_ramchanderrao@yahoo.com -
ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విధానమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ రామచందర్ రావుకు ఆన్లైన్ మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయనకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు రూ. 35 వేలు దోచేశారు. ఈ నెల 1వ తేదీన సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో రెండు అకౌంట్ల(ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు) నుంచి రూ. 35 వేలు కట్ అయినట్లు రామచందర్ రావుకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్‌కు గురైన ఎమ్మెల్సీ ఈ నెల 3వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. కేసు వివరాలను తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడి కానిస్టేబుల్ మృతి
ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రశాంత్‌నగర్ సమీపంలో కాలువలో పడి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతని పేరు ఎన్ రామచందర్రావుగా అని తెలిసింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి!
♦ మూడు నాలుగు రోజుల్లో నియామకం! ♦ తెరపైకి డాక్టర్ లక్ష్మణ్ పేరు ♦ ఆశావహుల్లో రామచందర్‌రావు, లక్ష్మీనారాయణ ♦ నేరుగా నియమించనున్న జాతీయ కమిటీ సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర విభాగానికి కొత్త సారథిని నియమించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మూడు నాలుగు రోజుల్లో ఈ నియామకం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21లోగా దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా అధ్యక్షులను నియమించాలని... అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పార్టీకి కూడా కొత్త సారథిని పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. నాలుగు నెలల కిందే బీజేపీ రాష్ట్ర విభాగం సంస్థాగత ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్నా... వివిధ కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా జాతీయ స్థాయిలో పార్టీకి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు కోసం.. పార్టీ అధిష్టానం వెంటనే నేరుగా రాష్ట్ర కమిటీకి సారథిని నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీలో కీలక నేతలు, సీనియర్ల నుంచి అధిష్టానం నేతలు అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మూడు నాలుగు రోజుల్లో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. తెరపైకి లక్ష్మణ్ పేరు... బీజేపీ రాష్ట్ర సారథిగా డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న లక్ష్మణ్.. చాలా సీనియర్, పార్టీకి విధేయుడు కావడంవల్ల జాతీయ నాయకత్వం ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీంతోపాటు రెండు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఇతర అవకాశాలు కల్పించడానికి కూడా ఇదే మార్గమని అధిష్టానం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోం ది. లక్ష్మణ్‌కు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని, కిషన్‌రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిని చేయాలనే ప్రతిపాదనను పరిశీలి స్తున్నట్లు పార్టీ ముఖ్యనేతల ద్వారా తెలిసింది. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ... ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతానని, కొత్త బాధ్యతలను నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ ముందు కు రాకుంటే.. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేరును జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయవాదిగా, వివిధ ఉద్యమాల్లో క్రియాశీల నేతగా, జిల్లాల్లోని క్షేత్రస్థాయి నేతలతో సంబంధాలు కలిగిన కొత్త ముఖంగా రామచందర్‌రావు పార్టీకి ఉపయోగపడతారనేది వారి భావన. రాష్ట్ర పార్టీలో రామచందర్‌రావుకు వ్యతిరేకులెవరూ లేకపోవడం అదనపు అర్హత. పార్టీలోని అన్నివర్గాలను సమన్వయం చేసుకుని పనిచేస్తారనే విశ్వాసం కూడా రాష్ట్రపార్టీలో ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత యెండల లక్ష్మీనారాయణ పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా యెండల అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్టు కీలకనేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకుడిగా యెండల లక్ష్మీనారాయణకు పేరుంది. దీనితోపాటు హైదరాబాదేతర జిల్లాలకు చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కూడా లక్ష్మీనారాయణకు ప్రయోజనకరం అయ్యే అవకాశముంది. వీరితోపాటు నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావు వంటివారు కూడా రాష్ట్ర పార్టీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. -
కమల దళపతి ఎవరు?
రాష్ట్ర అధ్యక్షుడి కోసం బీజేపీ కసరత్తు ♦ పార్టీకి జవసత్వాలు కలిగించే నేత కోసం వెతుకులాట ♦ బరిలో యెండల, ఇంద్రసేనారెడ్డి, రామచందర్‌రావు ♦ విముఖత చూపిన మురళీధర్‌రావు, లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియామకంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలకు ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. ఆ వెంటనే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడంపై అంతర్గత చర్చలకు ఉపక్రమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్‌రెడ్డి వరుసగా రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ రాష్ట్ర ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సత్తా కలిగిన నాయకుడెవరనే దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ముఖ్య విషయాల్లో కీలక పాత్ర పోషించే సం ఘ్ పరివార్ యోచన ఏమిటన్నదానిపై పార్టీ నేతలు అంచనాకు రాలేకపోతున్నారు. బీజేపీ విస్తరణకు రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకుని పార్టీకి జవసత్వాలు కలిగించే నాయకుడి ఎంపికకు అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మురళీధర్‌రావు, లక్ష్మణ్ విముఖత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జాతీయ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న పి.మురళీధర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. కానీ జాతీయ స్థాయిలోనే బాధ్యతలు నిర్వహిస్తానని, రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని ఆయన ఇప్పటికే తేల్చినట్లుగా సమాచారం. పార్టీలో సీనియర్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ పేరు కూడా చర్చకు వచ్చింది. శాసనసభాపక్షానికి నాయకుడిగా ఉంటూ పార్టీ అధ్యక్ష పదవిని కోరుకోవడం మంచిది కాదని, శాసనసభాపక్షనేతగానే కొనసాగుతానని లక్ష్మణ్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్త వారికే.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కోసం పార్టీలో వ్యక్తిగతంగా గ్రూపులు, వివాదాలు లేకుండా విస్తృత దృక్పథంతో పనిచేయగలిగే వారికోసం జాతీయ నేతలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటిదాకా పనిచేసినవారు కాకుండా కొత్త నేతకే పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నవారిలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలోనూ రెండోసారి గెలిచారు. పార్టీకి, సంఘ్ పరివార్‌కు విధేయంగా పనిచేస్తున్నారు. ఆయన బీసీ కావడం అదనపు అర్హత కూడా. కానీ ఆయన పార్టీ శాసనసభాపక్షనేత లక్ష్మణ్ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో అధ్యక్ష పదవిని ఇస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో సీనియర్ అయిన ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు కూడా పోటీలో ఉన్నారు. పార్టీలో ఎవరితోనూ వివాదాల్లేకుండా, జాతీయస్థాయిలో ప్రముఖులతో సంబంధాలున్న రామచందర్‌రావు అభ్యర్థిత్వానికి సంఘ్‌పరివార్ కూడా సుముఖంగానే ఉండొచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో బలమైన సామాజికవర్గం నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి పేరు కూడా చర్చలో ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో కఠినవైఖరి వంటి సానుకూల అంశాలు ఆయనకు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారం ఉన్నందున నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఇంద్రసేనారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీ సీనియర్లు బి.రాజేశ్వర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. -
'వాళ్లకు భయపడే సెప్టెంబరు 17ను నిర్వహించటం లేదు'
రంగారెడ్డి(తాండూరు): తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించటంలేదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు విమర్శించారు. తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ తన ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు పరామర్శించలేదని ఆయన విమర్శించారు.