బయటపడ్డ ఆన్‌లైన్ మోసం
Published Mon, Dec 26 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో ఓ ఆన్ లైన్ మోసం బయటపడింది. 24 ఏరియాకు చెందిన నరేష్(25) అనే యువకుడు ఆన్‌లైన్ మోసానికి బలయ్యాడు. నరేష్ గత నెల 19న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 389 పెట్టి ఒక మెమొరీ కార్డు కొన్నాడు. సరిగ్గా నెల తర్వాత డిసెంబర్ 19న రెండు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ టాన్సాక్షన్స్ ద్వారా రూ. 45,988, రూ.11,999 ల డబ్బు అమెజాన్‌కు బదిలీ అయింది. డబ్బులు తన అకౌంట్ నుంచి బదిలీ అయినట్లు నరేష్ రెండు రోజుల తర్వాత తెలుసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్‌కు, బ్యాంకుకు తెలియజేయగా.. వారు పోలీసులను ఆశ్రయించడని తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement