
ప్రతీకాత్మక చిత్రం
నాగ్‌పూర్ (మహారాష్ట్ర) : సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షలకు లక్షలు పొగొట్టుకుంటున్న ఉదంతాలు దేశవ్యవాప్తంగా ప్రతిరోజు చోటుచేసుకుంటున్నాయి. మీ డబ్బును రెండింతలు పెంచుతామంటూ ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన ఘటన తాజాగా నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కస్ట్‌మేర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఫోన్‌లో రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా బాధితుడికి కాల్ వచ్చింది.
ఆ సమయంలో తండ్రి మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు వెంటనే నిందితులు సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు. అంతే ఒక్క నిమిషంలోనే బ్యాంకు ఖాతా నుంచి 9 లక్షలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న తండ్రి అశోక్ మాన్వాటే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్షన్ 419, 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. నిందితులు కాలర్ యాక్సెస్ పొందిన వెంటనే డబ్బును తమ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని పేర్కొన్నారు.
చదవండి: మహారాష్ట్రలో జైళ్లు ఫుల్
Comments
Please login to add a commentAdd a comment