ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఈ తప్పులు చేయొద్దు
అనంతపురం: ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు లావాదేవీలు ఖాతాదారుల ఇళ్ల వద్ద నుంచే అతి సునాయసంగా జరిగిపోతున్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే అసలుకే మోసం వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొట్టే ముఠాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఇలా డబ్బులు పోగొట్టుకున్న బాధితులను వార్తలు నిత్యం చూస్తుంటాం. లాగిన్ అయ్యే సమయంలో ఏమరపాటు అస్సలు పనికిరాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించే ఖాతాదారులు ముఖ్యంగా ఈ 7 అంశాలు గుర్తుంచుకోవాలి.
1. ముఖ్యంగా ఆకర్షణీయ హెడ్‌లైన్ పెట్టగానే క్లిక్ చేస్తుంటాం. అది పెద్ద ప్రమాదానికే దారి తీస్తుంది. ఈ విషయం మనకు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక్కడ కొన్ని లింక్‌లు ఉంటాయి. ఒక లింక్‌తో మరో లింక్ అంటిపెట్టుకుని ఉండటం వల్ల వైరస్ వ్యాపిస్తుంది. అది మీ వ్యక్తిగత విషయాలను సంఘ విద్రోహక శక్తులకు చేర వేస్తుంది. ముఖ్యంగా మీ పాస్‌వర్డ్‌ను ఇతరులకు తెలియనివ్వకూడదు.
2. సిమ్ స్వాప్ అనేది ఆధునాతన పద్ధతి. ఈ సాంకేతికత వల్ల మీ పేరు, సంప్రదించాల్సిన నంబరు వివరాలు మీకు సంబంధించిన అన్ని బ్యాంకుల్లో నమోదు చేయిస్తే ఏదేని మోసం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. మొబైల్‌కు వెంటనే మెసేజ్ వస్తుంది.
3. ప్రస్తుతం వైఫై సేవలు ఎక్కడ చూసినా సౌలభ్యంగా లభిస్తున్నాయి. మీ వివరాలు మరొకరు తెలుసుకోకుండా ఉండాలంటే తరచూ పాస్‌వర్డ్ మార్చాలి. అప్పుడు మోసం జరగడానికి వీలుండదు.
4. సోషల్‌మీడియాలో సమాచారాన్ని షేర్ చేసుకోకూడదు. ఫేస్‌బుక్ ద్వారా హాకర్స్ సమాచారాన్ని సేకరిస్తుంటారు. తర్వాత మోసానికి పాల్పడుతారు. అందువల్ల పూర్తి పేరు, ఫోన్ నంబరు, పుట్టినతేదీ తదితర వివరాలను రహస్యంగా ఉంచడం మంచిది. ఈ సమాచారమే మోసగాళ్లకు ఆయువుపట్టు.
5. చాలావరకూ యాంటీవైరస్‌ను ఎవరూ అప్‌డేట్ చేయరు. దీనివలన సాఫ్ట్‌వేర్ వైరస్‌కు గురవుతుంది. యాంటీ వైరస్‌లు సాఫ్ట్‌వేర్‌లు కుండా అడ్డుకుంటాయి.
6. చాలామంది పాస్‌వర్డ్‌ను మర్చిపోకుండా ఉంటామని తమ పుట్టిన తేదీనో, సెల్ నంబరునో పెట్టుకుంటారు. అందువలన మోసగాళ్లు ఇలాంటి సమాచారంతో డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోక పోవడం మంచిది.
7. హాకర్స్‌కి సమాచారం ఇచ్చే నెట్ వ్యవస్థతో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కంప్యూటర్ లాగవుట్ చేసుకునే అలవాటు చేసుకోవాలి.