ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్‌యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు)
తన పాటలు, వాయిస్‌తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్‌ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్‌కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం.
రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్‌ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్‌కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్‌పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్‌డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం)
కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్‌తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్‌తో అనేక మంది ఫ్యాన్స్‌ని, ఫాలోయర్స్‌ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ.
Comments
Please login to add a commentAdd a comment