
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ఆన్‌లైన్‌లో పరిచయమై పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించి వ్యాపారం పేరుతో పెట్టుబడి పెట్టించి యువతిని మోసం చేసాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో దుబాయికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. దుబాయిలో మంచి వ్యాపారినని నమ్మించి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానన్నాడు.
త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకొని కలసి వ్యాపారం కొనసాగించొచ్చని కూడా నమ్మబలికాడు. నిజమని నమ్మిన యువతి 2017లో రూ.7లక్షలు అతడికి చెల్లించింది. అప్పటి నుంచి పెట్టుబడికి సంబంధించిన లాభాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు శనివారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment