
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుని ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. ఘటనకు చంద్రబాబు ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఆరు రోజుల్లో ఆగమేఘాల మీద నాసిరకంగా గోడ కట్టి.. దాని పక్కనే క్యూ లైన్‌లో భక్తులను నిలబెట్టి ప్రాణాలు పోయేలా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 11 నెలల పాలనలో తిరుపతి తొక్కిసలాటలొ ఆరుగురు చనిపోవడం, తిరుమల గోశాలల గోవుల మృతి, శ్రీకూర్మంలో తాబేళ్ల మరణం, కాశీనాయన ఆలయ కూల్చివేత.. ఇప్పుడు అప్పన్న ఆలయంలో భక్తుల దుర్మరణం లాంటి ఘటనలు జరిగాయని జగన్ అన్నారు.






















