బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్‌లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది.
తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment