ఎరుకల కుటుంబాలకు భూ పంపిణీ చేయాలి
Published Mon, Aug 8 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
న్యూశాయంపేట : అర్హత గల నిరుపేద ఎరుకల కుటుంబాలకు మూడెకరాల ప్రభుత్వం భూమిని పంపిణీ చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం నేతలు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యనిర్వాహణ కమిటటీ సమావేశానికి పల్లంకొండ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి మైదాన ప్రాంత ఎరుకలకు వర్తింప చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 6.5 శాతం రిజర్వేషన్లు అన్ని తెగలకు సమానంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం కేవలం లంబాడ తెగకు అధిక పాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్.పోచయ్య, బి.రఘు, రాజు, వనం రమేష్, తిరుపతి కార్పొరేటర్ ఓని భాస్కర్, పల్లంకొండ సురేష్, వర్థన్నపేట జెడ్పీటీసీ సారంగపాణి, జనగామ కౌన్సిలర్ దేవర ఎల్లయ్య, పి.యాదగిరి, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.
Advertisement
Advertisement