delivered
-
సంగారెడ్డి: రామచంద్రాపురంలో రోడ్డు పక్కనే మహిళ ప్రసవం
-
తప్పని డోలీ మోత.. దుప్పట్లు అడ్డంగా పెట్టి రోడ్డుపైనే ప్రసవం
సాక్షి, చింతపల్లి: తరతరాల నిర్లక్ష్యం ఇప్పటికీ మన్యవాసులకు శాపంగా మిగిలింది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాటిబందకు చెందిన నిండు గర్భిణి కొర్రా చిన్నిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం మార్గంమధ్యలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న చిన్నిని డోలిలో డౌనూరు ఆస్పత్రికి సమీపంలో ఉన్న రాసపనుకు తీసుకువెళ్లి అక్కడ నుంచి 108 వాహనంలో డౌనూరు తరలించే ప్రయత్నం చేశారు. దారిలో పురిటినొప్పులు అధికం కావడంతో రహదారి మధ్యలోనే దుప్పట్లు అడ్డంగా పెట్టి ఆమె వెంట వచ్చిన మహిళలు ప్రసవం జరిపారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లీ బిడ్డలిద్దరినీ డౌనూరు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు కల్పించారు. -
పండంటి పాపాయికి జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని భార్య
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (57) మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య క్యారీ సైమండ్స్ గురువారం తెల్లవారు జామున లండన్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం మేలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020 ఏప్రిల్‌లో విల్ఫ్రెడ్ అనే కుమారుడు జన్మించాడు. విదేశాంగ కార్యదర్శిగా జాన్సన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో 2018 నుండి సహజీవనం చేశారు. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లోకి మారారు. 2019 చివర్లో నిశ్చితార్థం, ఆ తరువాత ఈ ఏడాది మే 29న వెస్ట్‌మినిస్టర్ కేథడ్రల్‌లో ముప్పై మంది అతిథులతో రహస్య వేడుకలో వివాహం చేసుకున్నారు. 1993లో బ్రిటన్ ప్రధాని జాన్సన్ మొదటి భార్య అలెగ్రా మెస్టిన్ నుంచి విడిపోయిన మెరీనా వీలర్‌తో వివాహం, విడాకులు తెలిసిన సంగతి తెలిసిందే. -
అరుదైన ఘటన.. కోటిలో ఒకరికి మాత్రమే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని డాంగోరియి ఆస్పత్రిలో అరుదైన ఘటన జరిగింది. ఓ గర్భిణికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు రెండుతలల మృత శిశువును బయటకు తీశారు. నగరానికి చెందిన ఓ మహిళ నాలుగులు నెలల గర్భం ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న స్కానింగ్ సెంటర్ లో అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌లో శిశువుకు రెండు తలలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ శిశువుకు చాలా జన్యుపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. రెండు తలలే కాకుండా గుండె, మెదడులో కూడా లోపాలు ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి లీల ఆధ్వర్యంలో గర్భిణికి ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. ఇది మెడికల్ హిస్టరీలో అరుదైన ఘటన అని, కోటి మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఈ లోపంతో కాకుండా చాలా లోపాలు ఉండడం వల్ల ఆ శిశువు మనుగడ సాధించడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
వేంపల్లె : బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి నెప్పులు రావడంతో బస్సులోనే పురుడు పోసేందుకు చర్యలు తీసుకుని ఆర్టీసీ బస్సు సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా వేంపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. క్రిస్మస్ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లేందుకు గౌతమి అనే నిండు గర్భిణి పులివెందుల నుంచి తిరుపతి వెళుతున్న ఏపీ04జెడ్0131 నెంబర్ గల బస్సులో శనివారం ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో వేంపల్లె వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన బస్సు కండక్టర్ వేంపల్లె ప్రభుత్వాసుపత్రి సిబ్బందినకి ఫోన్ చేసి వారిని బస్సుకు వద్దకు పిలిపించారు. బస్సులోనే గర్భిణికి కాన్పు అయ్యేలా తగు చర్యలు తీసుకున్నారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆర్టీసీ సిబ్బంది తల్లీబిడ్డను వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బస్సులోని ప్రయాణికులు సిబ్బందిని అభినందించారు. -
ఎరుకల కుటుంబాలకు భూ పంపిణీ చేయాలి
న్యూశాయంపేట : అర్హత గల నిరుపేద ఎరుకల కుటుంబాలకు మూడెకరాల ప్రభుత్వం భూమిని పంపిణీ చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం నేతలు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యనిర్వాహణ కమిటటీ సమావేశానికి పల్లంకొండ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి మైదాన ప్రాంత ఎరుకలకు వర్తింప చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 6.5 శాతం రిజర్వేషన్లు అన్ని తెగలకు సమానంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం కేవలం లంబాడ తెగకు అధిక పాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్.పోచయ్య, బి.రఘు, రాజు, వనం రమేష్, తిరుపతి కార్పొరేటర్ ఓని భాస్కర్, పల్లంకొండ సురేష్, వర్థన్నపేట జెడ్పీటీసీ సారంగపాణి, జనగామ కౌన్సిలర్ దేవర ఎల్లయ్య, పి.యాదగిరి, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
మెట్రో రైల్వే స్టేషన్లో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ లో ఓ సంఘటన పలువురిని విస్మయ పర్చింది. ఓ 16 ఏళ్ల అమ్మాయి కేశవ్ పురం మెట్రో స్టేషన్ టాయిలెట్ లో చనిపోయిన పిండానికి జన్మనివ్వడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో వున్న ఆ బాలికను మెట్రో స్టేషన్ వైద్య సిబ్బంది, రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను మభ్యపెట్టి లైంగికదాడికి పూనుకోవడమే కాకుండా, బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన వైనం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఆశచూపిన గుల్షన్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని ఆరోపించింది. అయితే గర్భవతినని తెలియగానే అబార్షన్ చేయించడానికి వెళుతుండగా... తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గుల్షన్, అతని స్నేహితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై లైంగిక దాడి, విమెన్ ట్రాఫికింగ్ అభియోగాలు కింద కేసు నమోదు చేశామన్నారు. -
లోకల్ రైలులో పండంటి బిడ్డకు ప్రాణం
ముంబయి: అది ముంబయి లోకల్ రైలు. రద్దీ జనం.. రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో నిండు గర్భిణీ ప్రసవ వేదన. పురిటి నొప్పులతో అరుపులు. ఆ బోగీలో ఉన్నవారంతా ఒక్కసారిగా పక్కబోగిలోకి తోసుకుంటూ వెళ్లిపోయారు. కనీసం జాలి కూడా లేకుండా మహిళలు సైతం ఆమెను పట్టించుకోకుండా దూరంగా జరిగిపోయారు. పక్కబోగీలోకి జనాలు ఉన్నపలంగా వస్తూ ఉండటం చూసి అందులో ఉన్న ఇక్బాల్ అన్సారీ అనే జర్నలిస్టు ఏం జరుగుతుందబ్బా అని వెళ్లి చూశాడు. రక్తపు మరకలు.. చేతిలో పండంటి బిడ్డతో రామ్ లాల్ అనే ఓ తండ్రి. ఓ బిడ్డను ప్రసవించి ఓ మూలగా కూర్చున్న అతడి భార్య సుదేవి. ఆ దృశ్యం చూసి ఇక్బాల్ గుండె తరుక్కుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారిపై కొంత కోపం వచ్చినా.. వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 1276కు ఫోన్ చేశాడు. అది కలవకపోవడంతో వెంటనే అనే మరో రైలు సర్వీసు నెంబర్ 9833331111కు ఫోన్ చేసి విషయం వివరించాడు. కంజుర్ మార్గ్ స్టేషన్ వద్దకు రాగానే చైన్ లాగి రైలును ఆపేశాడు. వెంటనే అక్కడి చేరుకున్న రైల్వే సిబ్బంది స్ట్రెచర్‌తో వచ్చారు. ఆ సమయంలో తోటివారు కూడా ఇక్బాల్ సేవాగుణంతో ప్రభావితమై సహాయ చర్యలు ప్రారంభించారు. అందరూ కలిసి ఆమెను, బాలుడిని సురక్షితంగా తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు. ఇక్బాల్ సేవకు దంపతులు ధన్యవాదాలు తెలిపారు. -
108లోనే ప్రసవం
ములుగు(వరంగల్ జిల్లా): పురిటినొప్పులతో ఆసత్రికి వస్తున్న మహిళ 108 వాహనంలో ప్రసవించింది. ఈ సంఘటన సోమవారం వరంగల్ జిల్లా ములుగు మండలంలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని మాన్సింగ్తండాకు చెందిన నూనావత్ సంగీతకు పురిటి నొప్పులు రావడంతో భర్త రాంసింగ్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. నల్లబెల్లి 108 వాహనంలో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రేమ్‌నగర్ వద్ద మహిళ ప్రసవించింది. ఆడ పిల్లకు జన్మనిచ్చిన సంగీత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. కాగా, వైద్య సేవలందించిన ఈఎంటీ రేణుక, పైలట్ అజీంపాషాను స్థానిక వైద్యులు అభినందించారు. -
పరీక్ష కేంద్రంలో ప్రసవం