
దుప్పట్లు అడ్డంగా పెట్టి రోడ్డుపైనే ప్రసవం జరిపిస్తున్న మహిళలు
సాక్షి, చింతపల్లి: తరతరాల నిర్లక్ష్యం ఇప్పటికీ మన్యవాసులకు శాపంగా మిగిలింది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాటిబందకు చెందిన నిండు గర్భిణి కొర్రా చిన్నిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం మార్గంమధ్యలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న చిన్నిని డోలిలో డౌనూరు ఆస్పత్రికి సమీపంలో ఉన్న రాసపనుకు తీసుకువెళ్లి అక్కడ నుంచి 108 వాహనంలో డౌనూరు తరలించే ప్రయత్నం చేశారు.
దారిలో పురిటినొప్పులు అధికం కావడంతో రహదారి మధ్యలోనే దుప్పట్లు అడ్డంగా పెట్టి ఆమె వెంట వచ్చిన మహిళలు ప్రసవం జరిపారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లీ బిడ్డలిద్దరినీ డౌనూరు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment