సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (57) మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య క్యారీ సైమండ్స్ గురువారం తెల్లవారు జామున లండన్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం మేలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020 ఏప్రిల్‌లో విల్ఫ్రెడ్ అనే కుమారుడు జన్మించాడు.
విదేశాంగ కార్యదర్శిగా జాన్సన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో 2018 నుండి సహజీవనం చేశారు. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లోకి మారారు. 2019 చివర్లో నిశ్చితార్థం, ఆ తరువాత ఈ ఏడాది మే 29న వెస్ట్‌మినిస్టర్ కేథడ్రల్‌లో ముప్పై మంది అతిథులతో రహస్య వేడుకలో వివాహం చేసుకున్నారు. 1993లో బ్రిటన్ ప్రధాని జాన్సన్ మొదటి భార్య అలెగ్రా మెస్టిన్ నుంచి విడిపోయిన మెరీనా వీలర్‌తో వివాహం, విడాకులు తెలిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment